కఠినత్వం వెనక మహిళా ఎస్ఐ మానవత్వం.. ఏం చేసిందో తెలుసా.. !

ఎక్కువగా నేరస్దులను చూసి చూసి ఖాకీల హృదయం కఠినంగా మారిందని అనుకోని వారుండరు.

కానీ ఒక్కో సమయంలో వారి హృదయం కూడా కరిగిపోతుందని నిరూపించే ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయని నిరూపించే సంఘటన ఇప్పుడు చూడబోయేది.

ఆ వివరాలు చూస్తే.శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శిరీష అనే యువతి ఖాకీల్లో మానవత్వం ఉందని నిరూపించింది.

ఈ రోజు ఉదయం కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం ఉందని సమాచారం అందుకున్న ఎస్ఐ శిరీష ఘటన స్థలానికి వెళ్లి అతన్ని పోస్ట్‌మార్టం కోసం హస్పిటల్‌కు తరించే ఏర్పాట్లు చేస్తుండగా అక్కడి స్థానికులు ఎవరు కూడా ఆమెకు సహకరించడానికి ముందుకు రాలేదట.దీంతో ఎస్ఐ శిరీష మరొకరి సాయంతో శవాన్ని భుజాలపై మోసింది.

ఆ పొలం గట్ల మీదుగా కిలోమీటరుకు పైగా మృత దేహాన్ని మోసుకుంటు వచ్చి లలితా చారిటబుల్ ట్రస్ట్‌కు అప్పగించింది.అంతే కాకుండా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు అయిన చిన్ని కృష్ణతో కలసి దహన సంస్కారాలు కూడా నిర్వహించింది.

Advertisement

ఇక ఎస్ఐ శిరీష ఉద్యోగ నిర్వహణలో చూపిన చొరవకు ఉన్నతాధికారులు నుండే కాకుండా ప్రజల నుంచి కూడా విశేషంగా అభినందనలు అందుతున్నాయట.

కేరళ కాలేజీలో హెచ్ఓడీ ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు