ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా వైసిపి కి గట్టి షాక్ తగిలింది

సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీకి రాజీనామా చేశారు.పార్టీ కోసం కష్ట పడి పనిచేసిన తగిన గుర్తింపు లేని కారణంగా ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

 Srikakulam District Ycp Got A Big Shock When The Elections Were Approaching , El-TeluguStop.com

బుదవారం శ్రీకాకుళం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు.పార్టీలో తనను అడుగడుగున అవమానాలకు గురిచేశారనీ,టెక్కలి నియోజకవర్గంలో తనని అణచి వేసేందుకు కుట్రలు పన్నారని కృపారాణి ఆరోపించారు.

జగన్ ఓదార్పు యాత్ర సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆజ్ఞలు సైతం కాదని జగన్ కు అండగా నిలబడ్డాననీ అలాంటి నాకు పార్టీలో సరైన స్థానం గుర్తింపు లేకపోవడం తో పార్టీని విడనాడల్సి వచ్చిందని తెలిపారు.రానున్న ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియజకవర్గం నుండి పోటీ చేసి తానేంటో నిరూపిస్తానని సవాల్ విసిరారు.

తనకు గౌరవం ఇచ్చే పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube