ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా వైసిపి కి గట్టి షాక్ తగిలింది
TeluguStop.com
సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీకి రాజీనామా చేశారు.
పార్టీ కోసం కష్ట పడి పనిచేసిన తగిన గుర్తింపు లేని కారణంగా ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
బుదవారం శ్రీకాకుళం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు.
పార్టీలో తనను అడుగడుగున అవమానాలకు గురిచేశారనీ,టెక్కలి నియోజకవర్గంలో తనని అణచి వేసేందుకు కుట్రలు పన్నారని కృపారాణి ఆరోపించారు.
జగన్ ఓదార్పు యాత్ర సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆజ్ఞలు సైతం కాదని జగన్ కు అండగా నిలబడ్డాననీ అలాంటి నాకు పార్టీలో సరైన స్థానం గుర్తింపు లేకపోవడం తో పార్టీని విడనాడల్సి వచ్చిందని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియజకవర్గం నుండి పోటీ చేసి తానేంటో నిరూపిస్తానని సవాల్ విసిరారు.
తనకు గౌరవం ఇచ్చే పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు.
వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి… అందరూ షాక్!