చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సినిమా రంగానికి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఆమె గురించి తరచూ చర్చ జరుగుతుందనే సంగతి తెలిసిందే.శ్రీజ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో తరచూ ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అటు శ్రీజ నుంచి కానీ ఇటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ సరైన క్లారిటీ లేకపోవడం వల్ల కూడా శ్రీజ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఆగడం లేదు.
అయితే ఒక ఇంటర్య్వూలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి శ్రీజ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
చిరంజీవి, పవన్ వల్లే నా జీవితం మారిపోయిందని శ్రీజ చెప్పుకొచ్చారు.నవిష్క చిరంజీవికి బాగా క్లోజ్ అని ఆమె కామెంట్లు చేశారు.అందువల్లే మేము ఎక్కడికైనా వెళ్లినా నవిష్క విషయంలో మాకు ఎలాంటి బెంగ ఉండదని శ్రీజ వెల్లడించడం గమనార్హం.
కూతురు నవిష్క చిరంజీవి, పవన్ పాటలు అడగడంతో పాటు డ్యాన్స్ కూడా చేస్తుందని శ్రీజ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం నవిష్క పాట పాడుతూ డ్యాన్స్ చేస్తోందని తెలుస్తోంది.మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గత సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచారు.అయితే వాల్తేరు వీరయ్య సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను మించి ఉండనుందని ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మాత్రం నిరాశపరచదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మాస్ ఆడియన్స్ చిరంజీవి నుంచి ఏం కోరుకుంటారో ఆ అంశాలన్నీ ఈ సినిమాలో ఉండనున్నాయని తెలుస్తోంది.ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఫ్యాన్స్ సైతం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.జనవరి 13వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తుందో చూడాల్సి ఉంది.







