బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈటీవీలో మల్లెమాలవారు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల ద్వారా వారంలో మూడు రోజులు పాటు ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నారు.
ఇకపోతే ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీదేవి తామ కంపెనీ కార్యక్రమం ఏదో ఒక కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఇకపోతే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈవారం ఈ కార్యక్రమానికి ఇంద్రజ గెస్ట్ గా వచ్చారు.
ఇక ఈవారం ఈ కార్యక్రమంలో హైపర్ ఆది పుట్టినరోజు వేడుకలను ఎంత ఘనంగా సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తోంది.ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆదికి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక శ్రీముఖి ఎదవకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ హైపర్ ఆదిని పుట్టినరోజు సందర్భంగా అవమానిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక పుట్టినరోజు సందర్భంగా హైపర్ ఆది తనలో ఉన్న మరో టాలెంట్ కూడా బయటపెట్టారు.
ఈ క్రమంలోనే హైపర్ ఆది నూకరాజుతో కలిసి తన పుట్టినరోజు సందర్భంగా శ్రీరామదాసు సినిమాలోని ఓ పాటని ఎంతో అద్భుతంగా ఆలపించారు.
ఈ విధంగా నూకరాజు హైపర్ ఆది కలిసి పాట పాడుతుండగా అక్కడ ఉన్నటువంటి వారు ఎంతో పరవశించిపోయారు.ఇక పాట పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ హైపర్ ఆది పై ప్రశంసలు కురిపించారు.హైపర్ ఆదిలో కామెడీ మాత్రమే కాకుండా సింగింగ్ టాలెంట్ కూడా ఉందా అంటూ పలువురు ఈ ప్రోమో పై కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఆటపాటలతో సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎంటర్టైన్మెంట్ చూడాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి.