శ్రీదేవి బాహుబలి ని అందుకే వదిలేసిందా.?

బాహుబలి లాంటి సినిమాను ఎవరైనా వదులుకుంటారా? జగదేక సుందరి శ్రీదేవి వదులుకుంది.రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర కోసం మొదట శ్రీదేవినే సంప్రదించారు.

 Sridevi Responds On Rejecting Baahubali-TeluguStop.com

బాహుబలిని వదిలేసి పులి చిత్రాన్ని శ్రీదేవి ఎందుకు అంగీకరించింది అనేది జనాలకు అర్థం కాని ప్రశ్న .ఇదే ప్రశ్న శ్రీదేవిని అడగగా ” ఒక సినిమా ఒప్పుకున్నా, తోసిపుచ్చినా, నేను చాలా లోతుగా అలోచించి నిర్ణయం తీసుకుంటాను.ఒక సినిమా వద్దు అనుకున్న తరువాత ఇక దాని గురించి ఆలోచించను.‘బాహుబలి’ చేయకపోవడానికి నా కారణాలు నాకున్నాయి.ఆ సినిమా గురించి మాట్లాడటం అనవసరం.పులి కథ చెప్పినప్పుడు నా పాత్ర చాలా బాగా నచ్చేసింది.

అందుకే ఒప్పుకున్నాను.ఏ చిత్ర ఫలితం ఏమిటి అనేది నేను ఆలోచించను నా పాత్ర నాకు నచ్చితే చాలు ” అంటూ బదులిచ్చింది.

ఎదేమైనా, బాహుబలిలో కనిపించని అద్భుతం పులిలో ఏముంది అనేది ఇప్పటికి అంతుచిక్కని ప్రశ్నే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube