శ్రీరెడ్డి మరోసారి రెచ్చి పోయింది.ఆమె గత కొంత కాలంగా నానిని టార్గెట్ చేస్తున్న విషయం తెల్సిందే.
నాని తన జీవితంను నాశనం చేశాడు అంటూ పదే పదే చెబుతున్న శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా నాని పేరు ఎత్తకుండా ఉంది.కాని తాజాగా నాని ఆమెపై పెట్టిన పరువు నష్టం కేసు విచారణకు వచ్చినట్లుగా ఉంది.
అందుకే నానిని మళ్లీ టార్గెట్ చేసింది.ఎంతగా అంటే నోటితో అనలేని, ఇక్కడ రాయలేని మాటలతో దారుణంగా బూతులు తిడుతూ కుటుంబ సభ్యులను కూడా తిట్టేసింది.
నాని ఇండస్ట్రీలో మంచి పేరున్న హీరో.అలాంటి హీరోను శ్రీరెడ్డి మరీ ఇలా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో అతడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు.అతడికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.దారుణంగా ఉన్న ఈ పరిస్థితుల్లో శ్రీరెడ్డి సోషల్ మీడియా పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
తాజాగా నువ్వు కుక్క చావు చస్తావురా, నీ ఇంట్లో ఉన్న లక్ష్మి వెళ్లి పోయి దరిద్రం పట్టుకుంటుందిరా అంటూ పోస్ట్ చేసింది.