సుధీర్‌బాబుతో ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నభానటేష్.ఈ అమ్మడు మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది.
నభా నటేష్ తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించింది.ఆ చిత్రంలో ఈ అమ్మడి నటన మరియు డైలాగ్ డెలవరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
కనిపించింది కొద్ది సమయమే అయినా సినిమాపై తనదైన ముద్ర వేయడంలో నభా నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యింది.
ఇస్మార్ట్ శంకర్ చిత్రం సూపర్ హిట్ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు పార్టీల్లో మునిగి పోతున్నారు.
ప్రేక్షకులను కలిసి సక్సెస్ వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ వేడుకల్లో నభా నటేష్ మాత్రం కనిపించడం లేదు.
దాంతో చిత్ర యూనిట్ సభ్యులు ఈమెను ఎందుకు పక్కకు పెట్టారు అనే టాక్ మొదలైంది.తాజాగా ప్రమోషన్ కార్యక్రమాల్లో నభా నటేష్ ఎందుకు పాల్గొనడం లేదు అనే విషయంపై క్లారిటీ వచ్చింది.

సినిమా విడుదలైన రెండు మూడు రోజుల తర్వాత రామ్ గోపాల్ వర్మ ఒక లేట్ నైట్ చిత్ర యూనిట్ సభ్యులకు పార్టీ ఇచ్చాడు.ఆ పార్టీలో ఆయన చేసిన రచ్చ మామూలుగా లేదు.ఆ రోజు బీర్లు, షాంపైన్ బాటీల్స్ అందరిపై ఆయన గుమ్మరించడం జరిగింది.ఆ రోజు రాత్రి షాంపైన్ బాటిల్‌ను హీరోయిన్ నభా నటేష్‌పై పోయడంతో పాటు, నైట్ బాగా ఎంజాయ్ చేయడం వల్ల ఆమెకు జ్వరం పట్టిందట.
రెండు రోజులు హాస్పిటల్‌లో ఉన్న ఆమె ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లి పోయింది.రెండు వారాల పాటు పూర్తి రెస్ట్ అవసరం అని డాక్టర్లు సూచించడంతో ఆమె ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటుంది.