ప్రస్తుతం దేశం మొత్తం కూడా కేజీఎఫ్ 2 సినిమా ఫీవర్ కనిపిస్తుంది.మొన్నటి వరకు ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ఏ స్థాయి లో అయితే చర్చ జరిగిందో.
కాస్త అటు ఇటుగా ఈ సినిమా గురించి కూడా చర్చ ఆకాశమే హద్దు అన్నట్లుగా సాగుతోంది.దేశ వ్యాప్తంగా హీరో యశ్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ పరుగులు తీస్తూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సినిమా కు ఉన్న అంచనాల నేపథ్యం లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో అంచనాలు పెరుగుతున్నాయి.
ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి గురించి కూడా ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది.
మొదటి పార్ట్ లో ఈమెకు కావాల్సినంత స్క్రీన్ స్పేస్ దక్కలేదు.
దాంతో ఆమె నిరాశ వ్యక్తం చేసింది.కేజీఎఫ్ 2 లో ఈమె ఉంటుందా లేదా అనే అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.
కాని అనూహ్యంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆమె ను కంటిన్యూ చేశాడు.కేజీఎఫ్ 1 తర్వాత వరుసగా ఆఫర్లు అయితే వచ్చాయి కాని ఓకే చెప్పలేదు.
కేజీఎఫ్ 2 తర్వాత వరుసగా ఆఫర్లు వస్తాయని.అప్పుడు ఓకే చెప్పాలని ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
కేజీఎఫ్ 2 లో ఈమె పాత్ర ను ట్రైలర్ లో రివీల్ చేశారు.ఖచ్చితంగా పార్ట్ 1 కంటే పార్ట్ 2 లో ఈమెకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండే అవకాశం ఉందంటూ టాక్ వినిపిస్తుంది.
ఇక ఈమె సోషల్ మీడియా లో తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.చీర కట్టు లో కేజీఎఫ్ 2 హీరోయిన్ ఆకట్టుకుంటుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.







