మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల ( Sreeleela ) పెళ్లి కాకముందే ఇద్దరు పిల్లల తల్లైందట.మరి శ్రీలీల పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు ఎలా తల్లైంది అని మీ అందరూ ఆశ్చర్యపోతున్నారు కదూ.
అయితే ఇందులోనే ఉంది అసలు నిజం.మరి శ్రీలీలకు ఉన్న ఆ ఇద్దరు పిల్లల గురించి అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.
శ్రీలీల ఇండస్ట్రీలో ఎలా దూసుకుపోతుందో సమాజ సేవ చేయడంలో కూడా అంతే దూసుకుపోతుందట.అంతేకాదు ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్ తెచ్చుకున్నప్పటికీ అందరి లాగా లగ్జరీ వస్తువులు కార్లు,బ్రాండెడ్ వాచ్ లు, ఖరీదైన బట్టలు, హ్యాండ్ బ్యాగ్ లు,చెప్పులు వంటివి అస్సలు యూజ్ చేయదట.

అంతేకాదు ఈమె షాపింగ్ కి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్( Shopping malls ) కి వెళ్లకుండా చిన్న చిన్న షాపుల్లో తనకి అవసరమైన వస్తువులు కొనుక్కుంటూ చిరు వ్యాపారులకి తనవంతుగా సహాయం చేస్తుందట.ఇక ఈ మధ్యకాలంలో ఓ అనాదాశ్రమానికి వెళ్లిన శ్రీ లీల అక్కడ ఉండే ఇద్దరు పిల్లల్ని చూసి చాలా బాధపడిందట.

దాంతో వెంటనే ఆ ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకొని ఆ ఇద్దరు పిల్లలకి శ్రీలీల నే అన్నీ తానై చూసుకుంటుందట.ఇక షూటింగ్ లేనప్పుడల్లా వారితో ఆడుకుంటూ ఉంటుందట.షూటింగ్ ఉన్న టైంలో ఇంట్లో వాళ్ళు ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటారట.ఇక ఈ కారణంతోనే చాలామంది నెటిజన్స్ పెళ్లికాకుండా ఇద్దరు పిల్లల తల్లైంది.నిజంగా శ్రీలీల చాలా గ్రేట్.అసలు ఇంత చిన్న ఏజ్ లో అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావమ్మా అంటూ మెచ్చుకుంటున్నారు.
అంతేకాదు నీ మంచి మనసుకు హ్యాట్సాఫ్ అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ సినిమాలతో మాత్రమే కాకుండా శ్రీలీల సమాజ సేవ చేయడంలో కూడా ముందుంది అని చెప్పుకోవచ్చు.