Sreeleela Balakrishna: బాలయ్య మనస్తత్వం అలాంటిది.. ఆ విషయాలు చెబితే ఆశ్చర్యపోయా.. శ్రీలీల కామెంట్స్ వైరల్! 

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sreeleela) త్వరలోనే భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 Sreeleela Viral Comments On Balakrishna Full Details Inside-TeluguStop.com

ఈ సినిమాలో శ్రీ లీల బాలయ్యకు( Balakrishna ) కూతురి పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీ లీల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బాలకృష్ణ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Anil Ravipudi, Balakrishna, Sreeleela, Kajal-Movie

ఈ సందర్భంగా శ్రీ లీలా మాట్లాడుతూ గ్లామరస్ పాత్రలలో ఎప్పుడైనా నటించవచ్చు కానీ ఇలాంటి ఒక ఎమోషన్ పాత్రలో( Emotional Role ) నటించే అవకాశం చాలా అరుదుగా వస్తాయని ఈ సినిమాలో నటించడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించిందని తెలియజేశారు.ఇక ఈ సినిమాలో బాలయ్య గారు హీరో అనే విషయం తెలియగానే మొదట్లో చాలా భయపడ్డాను కానీ ఆయనని కలిసిన మరుక్షణం నుంచి ఆ భయం అనేది తొలగిపోయిందని ఆయన అందరూ చెప్పుకునేలా ఉండరు అంటూ శ్రీ లీల తెలియజేశారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Sreeleela, Kajal-Movie

బాలకృష్ణ గారిది పసిపిల్లల మనస్తత్వమని శ్రీ లీల తెలియజేశారు.బాలకృష్ణ అనే పేరు ఆయనకి యాప్ట్‌ అని చెప్పాలి.ఆయనకి అపారమైన పరిజ్ఞానం ఉంది.

సినిమా రంగంపైనే కాకుండా ఇతర రంగాలపై కూడా ఆయనకు ఎంతో పరిజ్ఞానం ఉంది అంటూ శ్రీ లీల ఈ సందర్భంగా తెలియజేశారు తాను మెడిసిన్ పరీక్ష( Medicine Exam ) రాస్తూ సెట్ కి వెళ్ళగా ఆయన అందులో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నింటి గురించి చాలా డీప్ గా నాతో డిస్కషన్ చేసేవారు అసలు మెడిసిన్ చదవకపోయినా బాలయ్య గారికి ఈ విషయాలు గురించి ఎలా తెలుసు అంటూ నేను ఆశ్చర్యపోయే దానిని అంటూ ఈ సందర్భంగా శ్రీ లీల బాలకృష్ణ మనస్తత్వం గురించి ఆయన వ్యక్తిత్వం గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube