ధమాకా బ్యూటీ చేతిలో ఏకంగా 9 సినిమాలు.. ఇందులో నాలుగు హిట్ ఐనా..

టాలీవుడ్ లో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్న యంగ్ బ్యూటీ శ్రీలీల ( Sreeleela ) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఈమె ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయ్యింది.

 Sreeleela Movie Offers List, Sreeleela, Tollywood, Mahesh Babu, Harish Shankar-TeluguStop.com

ఈమె పెళ్లి సందడి ( Pelli SandaD ) సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన పెళ్లి సందడి మూవీ ద్వారా టాలీవుడ్ ( Tollywood ) లోకి రాఘవేంద్రరావు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.

Telugu Mahesh Babu, Pawan Kalyan, Pelli Sandad, Sreeleela, Sreeleelaoffers, Ssmb

ఇక మొదటి సినిమా తోనే ఈమె నటన, అందం, డ్యాన్స్, హావభావాలతో అలరించి తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది.దీంతో ఈమెకు వరుస ఆఫర్స్ రావడం మొదలయ్యాయి.ఇక ఈ మధ్యనే వచ్చిన ధమాకా సినిమాతో అయితే ఈ అమ్మడు ఏకంగా స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరిపోయింది అనే చెప్పాలి.ఈ సినిమాలో మాస్ రాజా రవితేజను మించిన ఎనర్జీతో ఈ అమ్మడు ఆకట్టుకుంది.

Telugu Mahesh Babu, Pawan Kalyan, Pelli Sandad, Sreeleela, Sreeleelaoffers, Ssmb

దీంతో ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి మరిన్ని ఆఫర్స్ వరిస్తున్నాయి.ఇంతకు ముందు కుర్ర హీరోల సరసన అవకాశాలు అందుకున్న ఈమె ధమాకా తర్వాత మాత్రం స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటుంది.ప్రస్తుతం శ్రీలీల చేతిలో మొత్తం 9 సినిమాలు ఉన్నాయని టాక్.ఒకేసారి ఇన్ని అవకాశాలు అంటే అందరు షాక్ అవుతున్నారు.

Telugu Mahesh Babu, Pawan Kalyan, Pelli Sandad, Sreeleela, Sreeleelaoffers, Ssmb

వీటిల్లో మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ కాంబోలో SSMB28 సినిమా, బాలయ్య (Balakrishna)-అనిల్ కాంబోలో సినిమా, హరీష్ శంకర్ (Harish Shankar) – పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh ) సినిమా, నితిన్ 32వ సినిమాలో, రామ్ బోయపాటి మూవీ లో ఇంకా పంజా వైష్ణవ తేజ్ 4వ సినిమాలో, కిరిటీ రెడ్డి హీరోగా లాంచ్ అవుతున్న సినిమాలో, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రోజు సినిమాలలో ఈమె నటిస్తుంది.

మొత్తం మీద ఇన్ని సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ డేట్స్ మాత్రం క్లాష్ అవకుండా పక్కా ప్రణాళికతో ముందుకు పోతుంది.మరి వీటిలో చాలా వరకు సక్సెస్ అయ్యేట్టుగానే కనిపిస్తున్నాయి.కుర్ర హీరోల సినిమాలు పక్కన పెడితే స్టార్ హీరోల సినిమాలు మాత్రం పక్కా హిట్ అయినట్టే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube