తెలుగులో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.ఒక సినిమా జయపజయాలు ఆ సినిమా స్క్రిప్టు పైన లేదంటే దర్శకుడు పైన ఆధారపడి ఉంటాయి.
కానీ మన దరిద్రం ఏంటి అంటే అన్ని విషయాలు పక్కన పెట్టి ఎవరో ఒకరిని బలి చేయడం చాలా సర్వసాధారణం.ఇలాంటి సిచువేషన్ లో ఎక్కువగా హీరోయిన్స్( Heroines ) బలవుతూ ఉంటారు.
ఆ సినిమా పరాజయానికి హీరోయిన్ నటించడమే మూల కారణం అన్నట్టుగా సోషల్ మీడియా కూడా ప్రవర్తిస్తూ ఉంటుంది.దాంతో ఒకటి రెండు ఫ్లాప్స్ పడ్డ తర్వాత హీరోయిన్స్ ఐరన్ లెగ్స్ అనే ముద్ర వేసుకొని ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లి పోవాల్సి వస్తుంది.

ఒకప్పుడు రమ్యకృష్ణ నుంచి ఇప్పుడు శ్రీలీల( Sreeleela ) వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది.ఈ సినిమా పరాజయానికి వారు ఒక శాతం కూడా కారణం కాదు అనే విషయం హీరోలకు, డైరెక్టర్స్ కి, నిర్మాతలకు కూడా తెలుసు.అయినా కూడా ఏదో ఒక చిన్న సెంటిమెంట్ ఆధారంగా ఇలా చేస్తూ ఉంటారు.ఇప్పుడు హీరోయిన్స్ కూడా తెలివి మీరు పోయారు.ఒక భాషలో పరాజయం వస్తే పోయేదేముంది.మరో భాషలో అవకాశాలు వెతుక్కుంటాం అనే విధంగా ట్రెండీగా ఉన్నారు.
హీరోయిన్స్ లలో నిన్న మొన్నటి వరకు కృతి శెట్టి( Krithi Shetty ) కూడా మూడు వరస విజయాలు సాధించాక నాలుగైదు పరాజయాలు పడ్డాయి.దాంతో ఆమెను ఐరన్ లెగ్ గా( Iron Leg ) భావించి ఒక్క తెలుగు సినిమాకి కూడా ఎవరు తీసుకోవడం లేదు.

ఇక ఇప్పుడు శ్రీలీల వంతు వచ్చింది.ఆమె నటించిన సినిమాలు వరుసగా పరాజయాలు అవుతున్నాయి.దాంతో శ్రీలీల ఐరన్ లెగ్ గా మారిపోయింది అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకునే చందంగా శ్రీలీల కూడా తెలివి తక్కువ అమ్మాయి ఏమి కాదు.
ఆమె ప్రస్తుతం ఇక్కడ తెలుగులో సినిమాలు చేస్తూనే తమిళ భాష పై ఫోకస్ చేసింది.ప్రస్తుతం అక్కడ స్క్రిప్ట్స్ వింటుంది.కొత్త సినిమాలకు సైన్ కూడా చేస్తుంది.రేపో మాపో ఆ సినిమాలకు సంబంధించిన వివరాలను బయట పెడుతుంది.
ఇంతకు ముందు రష్మిక మందన,( Rashmika Mandanna ) పూజా హెగ్డే( Pooja Hegde ) సైతం తెలుగులో నటిస్తూనే తమిళ్లో అలాగే కన్నడలో నటించడం చేశారు.అయితే ఒక చోట పోయినా మరో చోట వెతుక్కోవచ్చు కాబట్టి హీరోయిన్స్ కి ఏడో కాలేదని వీరు నిరూపిస్తున్నారు.