శ్రీలీల అసలైన ఎక్స్ట్రా ఆర్డినరీ ఉమెన్... శ్రీలీల టాలెంట్ బయట పెట్టిన నితిన్?

<emవక్కంతం వంశీ( Vakkantham Vamshi ) డైరెక్షన్లో నితిన్ ( Nithin ) శ్రీ లీల( Sreeleela ) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్( Extra Ordinary Man ) .ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

 Sreeleela Extra Ordinary Women Nithin Comments Goes Viral, Nithin, Sreeleela,-TeluguStop.com

చాలా రోజుల నుంచి నితిన్ సరైన హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాపై ఎన్నో అంచనాలు కూడా పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమా ఎనిమిదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకలను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా నితిన్ శ్రీలీల గురించి మాట్లాడుతూ ఆమెలో ఉన్నటువంటి టాలెంట్ మొత్తం బయటపెట్టారు.

Telugu Extra Ordinary, Nithin, Sreeleela, Tollywood-Movie

శ్రీ లీల( Sreeleela ) ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన వినిపిస్తున్నటువంటి పేరు అని నితిన్ తెలిపారు.ఆమె ఒకవైపు సినిమా ప్రమోషన్లకు మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లు మరోవైపు సినిమా షూటింగ్ అంటూ క్షణం పాటు తీరిక లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్నారని తెలియజేశారు.ఇక శ్రీ లీల అందరికీ ఒక నటిగా మాత్రమే తెలుసు అలాగే కాబోయే డాక్టర్ అని కూడా తెలుసు కానీ ఈమెలో తెలియని టాలెంట్ చాలా దాగి ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా నితిన్ మాట్లాడారు.ఈ సినిమా షూటింగ్ మొదటి రోజు ఆమెను నా దగ్గరకు వచ్చి తనని తాను పరిచయం చేసుకొని తన గురించి కొన్ని విషయాలు చెప్పారు.

Telugu Extra Ordinary, Nithin, Sreeleela, Tollywood-Movie

ఈమె డాక్టర్ యాక్టరస్ మాత్రమే కాదు ఈమె స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ పోటీలలో కూడా పాల్గొన్నారు.అదేవిధంగా స్టేట్ లెవెల్ హాకీ ప్లేయర్ అంటూ కూడా నితిన్ శ్రీ లీలలో దాగి ఉన్నటువంటి టాలెంట్ తెలియజేశారు.వీటితోపాటు కూచిపూడి భరతనాట్యం వంటి డాన్సులు కూడా తనుకు వచ్చని ఇలా తన గురించి చెబుతూ ఉంటే నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని తెలియజేశారు.ఇక మా సినిమాలో నేను ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మాత్రమే కానీ నిజ జీవితంలో శ్రీలీల( Sreeleela ) అసలైన ఎక్స్ట్రాడినరీ ఉమెన్ అంటూ ఈ సందర్భంగా నితిన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube