ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున శ్రీ లీల( Sreeleela ) పేరే చెప్పేస్తారు.పెళ్లి సందడి సినిమా( sandaD ) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈ కన్నడ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో తన అందం నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
అనంతరం రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా ( Dandakam )ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ అందుకోవడంతో ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి.ఇలా సీనియర్ హీరోల నుంచి మొదలుకొని యంగ్ హీరోల సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీ లీల పెళ్లి గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అసలు ఈమె పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తను చూస్తే అసలు శ్రీ లీల పెళ్లి ఇంత సిల్లీగా చేస్తారా అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.ఈ విధంగా తన పెళ్లి గురించి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు.ఈమె బాలకృష్ణ ( Balakrishna ) హీరోగా నటించిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari )సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందంతో కలిసి ఫోటోలు దిగారు.
అయితే ఈ ఫోటోలలో శ్రీ లీల పక్కన బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ( Mokshagna )నిలబడి ఉండడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

ఇక త్వరలోనే మోక్షజ్ఞ సినిమాలలోకి రాబోతున్న నేపథ్యంలో ఈయన సినిమాలపై అవగాహన పెంచుకోవడం కోసం ఈ సినిమా షూటింగ్ లొకేషన్లో కూడా పలు సందర్భాలలో కనిపించారు.ఇక శ్రీ లీల పక్కన నిలబడి మోక్షజ్ఞ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో కొందరు మోక్షజ్ఞను శ్రీ లీల పెళ్లి చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున పెళ్లి వార్తలను సృష్టించారు.దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా పక్కపక్కన నిలబడితేనే పెళ్లి చేసేస్తారా… అంటూ శ్రీ లీల అభిమానులు తీవ్రస్థాయిలో ఈ వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







