ఉప్పెన సినిమాలో బేబమ్మగా అలరించిన కృతి శెట్టి ( Krithi Shetty )ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టగానే వరుస ఛాన్స్ లు అందుకుంది.అవకాశాలు వస్తున్నాయ్ కదా అని అమ్మడు కథల విషయంలో ఆలోచించకుండా చేసింది తీరా చూస్తే ఇప్పుడు కెరీర్ రిస్క్ లో పడింది.
అయితే ప్రస్తుతం మరో హీరోయిన్ శ్రీ లీల కూడా అదే పొరపాటు చేస్తుందని తెలుస్తుంది.పెళ్లిసందడి సినిమాతో మెప్పించిన శ్రీ లీల( Sree Leela ) ధమాకాతో సూపర్ హిట్ కొట్టింది.
ఇక ఆ సినిమా నుంచి వరుస క్రేజీ ఛాన్స్ లు అందుకుంటుంది.
మహేష్, బాలకృష్ణ, రామ్, వైష్ణవ్ తేజ్ ఇలా అందరు స్టార్స్ తో కలిసి నటిస్తుంది.అయితే కృతి శెట్టి కన్నా శ్రీ లీల డ్యాన్స్ లో కానీ పర్ఫార్మెన్స్ లో కానీ కొద్దిగా బెటర్ అనిపిస్తుంది.కాబట్టి కృతి కి జరిగినట్టుగా శ్రీ లీలకు జరగకపోవచ్చు.
ఏది ఏమైనా శ్రీ లీల కూడా కెరీర్ విషయంలో జాగ్రత్త పడితే బెటర్ అని చెప్పొచ్చు.మరి అమ్మడు చేస్తున్న సినిమాలు హిట్ పడితే ఓకే కానీ ఏమాత్రం తేడా వచ్చినా శ్రీ లీల కూడా రిస్క్ లో పడే ఛాన్స్ ఉంది.