ఈ మధ్య కాలంలో అన్ని బంధాలు ఆర్థిక సంబంధాలే.ఇది జగమెరుగని సత్యం.
ఇక సినిమా ఇండస్ట్రీ లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు.మనుషుల చుట్టూ, మనీ చుట్టూ మాత్రమే అక్కడ ఎక్కువ గా ఆలోచిస్తారు.
అందుకే సినిమా ప్రపంచం ఒక మాయ ప్రపంచం.అయితే గతం లో ఇలా ఉండేది కాదు.
అందరు బాగా కలిసి మెలిసి ఉండేవారు.ఒకరికి బాధ వస్తే మరొకరు అండగా ఉండే వారు.
లంచ్ సమయంలో ఒకరింటి ఫుడ్ ని మరొకరితో పంచుకొని తినేవారు.
కానీ ఇప్పుడు అలా కాదు.
ఆ రోజులు ఇక రావు.ఇక నందమూరి తారక రామ రావు గారికి ప్రతి నటుడితో ఆయనకు ఒక అనుబంధం ఉండేది.
అలనాటి స్టార్ హీరో చిత్తూర్ నాగయ్య ని నాన్న అని సంబోధించే వారు.అలాగే నటి పండరి భాయి ని అమ్మ అంటూ పిలిచే వారు.
అంతకు ముందు ఆ పాత్రా లో వారు నటించడం తో అలాగే సంబోధిస్తూ గౌరవం ఇచ్చేవారు.సావిత్రి లాంటి మహా నటిని అయన తన సొంత చెల్లెలిగా, గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు గా ఉన్న సూర్యకాంతమ్మ ను అత్త అంటూ పిలిచి ఆట పట్టించేవారు.
అయితే అయన కోడలా అంటూ పిలిచినా నటి కూడా ఉన్నారు.ఆమె మరెవరో కాదు ఎస్ వరలక్ష్మి. హీరోయిన్ గా తెరంగేట్రం చేసి ఎన్నో వందల సినిమాల్లో నటించిన వరలక్ష్మిని ఎన్టీఆర్ కోడలా అని పిలిచేవారు.అందుకు గల కారణం ఒక సినిమాలో వరలక్ష్మి అన్న గారికి కోడలి పాత్రలో నటించింది.
ఈ చిత్రంలో అయన బృహన్నల వేషం వేశారు.అప్పటి నుంచి ఎస్ వరలక్ష్మి తో సరదాగా ఉండే వారట పెద్దాయన.
ఆ తర్వాత ఎన్టీఆర్ తో చాలా సినిమాలో కలిసి నటించిన వరలక్ష్మి ఎన్టీఆర్ తనను కోడలు అంటూ పిలవడం తనికెంతో గర్వం గా ఉండేది అంటూ చివరగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.ఎన్టీఆర్ ని చూసి తాను ఎంతో నేర్చుకున్నని , అందులో ముఖ్యంగా టైం విలువ అని, అయన ప్రతి రోజు ఏడూ గంటలకు మేకప్ తో సహా షూటింగ్ సెట్ లో ఉండేవారని , అందుకే తాను కూడా వృత్తి పట్ల క్రమశిక్షణ ఆయన దగ్గర చూసి నేర్చుకున్నని చెప్పారు
.