మహబూబాబాద్ కరువుపై పాట కూడా రాశానని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.జిల్లా పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు నూతన కలెక్టరేట్ ను ఆయన ప్రారంభించారు.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ కరువు తీరితే కురవి మల్లికార్జున స్వామికి బంగారు మీసాలు చేయిస్తానని మొక్కుకున్నానన్నారు.తెలంగాణ వచ్చాక అన్నీ సాధించుకున్నామన్న కేసీఆర్ జిల్లాలో గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు కేటాయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు ఇస్తున్నామన్నారు.మత విద్వేషాలు రెచ్చగొడితే దేశం మరో ఆఫ్ఘాన్ లా అవుతుందని పేర్కొన్నారు.
కేంద్రంలో మంచి ప్రభుత్వం ఉంటేనే దేశాభివృద్ధి జరుగుతోందని తెలిపారు.కేంద్ర అసమర్థత వలనే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వెల్లడించారు.







