గుర్రపు పందాల విషయంలో ఎస్వీఆర్ వల్ల హర్ట్ అయ్యిన ఎన్టీఆర్

అప్పట్లో సినిమా పరిశ్రమను ఏలిన వారిలో అన్నగారు ఎన్టీఆర్ ఉంటే అయన అప్పట్లో అగ్ర నటులైన అందరితో ఎంతో స్నేహం గా ఉండేవారు.ముఖ్యంగా ఎస్వీఆర్ వంటి మహా నటుడితో ఎన్టీఆర్ కి మంచి స్నేహం ఉండేది.

 Sr Ntr Hurt By Svr Over Horse Race Details, Ntr , Svr, Sr Ntr, Nandamuri Taraka-TeluguStop.com

అది ఎలా ఉండేదంటే అన్నగారు రంగ రావు గారిని అన్న గారు అని పిలిస్తే ఆయన ఎన్టీఆర్ ని తమ్ముడు అని పిలిచే వారట.వీరిద్దరూ కలిసి అనేక సినిమాల్లో కూడా కలిసి నటించారు.

పైగా ఒకరింటికి ఒకరు కుటుంబాలతో సహా వెళ్లేవారట.అన్నగారు ఇండస్ట్రీ కి వచ్చిన తొలి రోజుల్లోనే ఎస్వీఆర్ ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంది ఎక్కడికో వెళ్ళిపోతాడు అంటూ జోశ్యం చెప్పాడట.

అయన అన్నట్టుగానే ఎన్టీఆర్ ఆంధ్ర దేశాన్ని మొత్తం తన నటనతో అబ్బురపరిచారు.అలాగే రాజకీయాల్లోనూ తిరుగు లేని ఆధిపత్యం కనబరిచారు.ఇక ఎన్టీఆర్ సినిమాల్లోని వచ్చిన కొత్తల్లో పాతాళ భైరవి సినిమాలో నటించగా అందులో ఎస్వీఆర్ విలన్ గా నటించి ఢీకొట్టాడు.ఇక ఎన్టీఆర్ ఒక సినిమా కోసం రాజకుమారిడిగా నటించాల్సి ఉంది.

రాజకుమారుడి వేషం కాబట్టి గుర్రం పై స్వారీ చేయాల్సి ఉంటుంది.

Telugu Horse Race, Nandamuritaraka, Ntr Svr, Patala Bhairavi, Sr Ntr, Sv Rangara

ఆ సినిమాలో వేట కు వెళ్లాల్సిన సీన్స్ కోసం మంచి అరేబియన్ గుర్రాన్ని పట్టుకోచ్చారు.అయితే చాల పొగరు బోతు గుర్రం కావడం తో ఎవరికి సాధారణంగా లొంగేది కాదు.లొంగదీయడానికి వచ్చిన వారిని తిప్పి కొట్టేది.

గుర్రం పై ఎన్టీఆర్ ఎలా స్వారీ చేయించాలో అని చిత్ర బృందం సతమతమయ్యారట.ఆ టైం లో గుర్రపు పందాలకు కూడా ఎప్పుడు వెళ్ళేలేదట.

అయితే ఎస్వీఆర్ మాత్రం ఆ పని చేయడంలో సిద్ధహస్తుడు.

Telugu Horse Race, Nandamuritaraka, Ntr Svr, Patala Bhairavi, Sr Ntr, Sv Rangara

బాగా గుర్రపు స్వారీలు కూడా చేసేవాడట.దాంతో అయన దగ్గరకు వెళ్లి సలహా అడిగారట.అయన చాల గంభీరంగా ఏం తమ్ముడు ఎప్పుడు గుర్రపు పందేలకు వెళ్ళలేదు అని అడిగారట.

ఆలా నలుగురిలో అడిగేసరికి అయన కాస్త నొచ్చుకున్నారట.అది గమనించిన ఎస్వీఆర్ ఆలా కాదు తమ్ముడు నీ గుర్రాన్ని నా ఇంటికి పంపించు అని చెప్పారట.

ఆలా తన ఇంట్లో ఉన్న గుర్రాలతో రెండు రోజులు ఉంచి ట్రైన్ చేసి సినిమాకు వాడారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube