2nd ఇన్నింగ్స్ లో Sr ఎన్టీఆర్ జాతకం మార్చిన ఆ రెండు సినిమాలు …!

ప్రతి హీరోకు కొన్ని విజయాలు ఉన్నట్టే మరికొన్ని ప్లాపు లు ఉంటాయి.అందుకు ఎన్టీఆర్ లాంటి మహా నాయకుడు కూడా ఏమి మినహాయింపు కాదు.

కొన్ని సార్లు విజయాలు ఎలా దక్కుతాయో అపజయాలు కూడా పలకరిస్తాయి.అన్ని తట్టుకొని నిలబడ్డ నటుడే స్టార్ హీరో అవుతాడు.

అందుకే ఎన్టీఆర్ గొప్ప నటుడిగా చరిత్రలో నిలిచిపోయాడు.ఇక అసలు విషయంలోకి వెళ్తే ఎన్టీఆర్ కి ప్లాప్ లు వెంటాడుతున్న సమయం లో అయన కెరీర్ ని కొనసాగించేలా చేసిన సినిమాలు రెండు.

అందులో ఒకటి అడవి రాముడు అయితే మరొకటి యమగోల.ఇందులో మరొక విశేషం ఏంటి అంటే ఈ రెండు సినిమాలు కూడా శోభన్ బాబు చేత రిజెక్ట్ చేయబడ్డాయి.

Advertisement

అప్పటికే ఒక హిట్ పడితే మూడు ప్లాప్ లు అన్నట్టు గా ఎన్టీఆర్ కెరీర్ నడుస్తుంది.అడవి రాముడు విషయానికి వెళ్తే ఈ చిత్ర నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణలు శోభన్ బాబు హీరో గా తహసీల్దార్ గారి అమ్మాయి అనే ఒక సినిమా తీయగా ఇది చాల పెద్ద హిట్ అయ్యింది.

దేనికి కె ఎస్ ప్రకాష్ రావు దర్శకుడు.

ఈ సినిమా తర్వాత ఇదే నిర్మాతలు శోభన్ బాబు హీరో గా రెండో సినిమా ప్రేమ బంధం తీశారు.ఇది కే విశ్వనాధ్ దర్శకత్వం లో వచ్చింది.ఇది పలు కారణాల చేత ప్లాప్ అయ్యింది.

ఇక మూడో సినిమా గా అడవి రాముడు కథ అనుకోగా శోభన్ బాబు రిజెక్ట్ చేసాడు.దేనికి కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించగా పెద్ద హిట్ అయ్యింది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఆ తర్వాత కొన్నేళ్ల పాటు అయన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

Advertisement

పల్లవి ఫిలిమ్స్ బ్యానర్ వారు శోభన్ బాబు తో ఇద్దరు ఇద్దరే అనే సినిమాను తీయగా అది మంచి విజయాన్ని దక్కించుకుంది.దాంతో అదే హీరో తో ఈ తరం మనిషి అనే చిత్రాన్ని నిర్మించగా అది ప్లాప్ అయ్యింది.ఇక మూడో సినిమా గా యమగోల కథ రాయించి శోభన్ బాబు కి వినిపిస్తే అయన ఎందులో వద్దు అన్నారు.

దాంతో ఎన్టీఆర్, బాలయ్య లతో ఈ సినిమా తీద్దాం అంటే సత్యనారాయణ ను యముడిగా పెట్టి, ఎన్టీఆర్ హీరో గా చేయగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.దాంతో మళ్లి కొన్నేళ్ల పాటు వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

తాజా వార్తలు