ట్వీట్ లో స్పెషల్ టెక్స్ట్ ఫీచర్స్..టెస్టింగ్ దశలో ఉన్న ట్విట్టర్..!

ఈ కాలంలో ట్విట్టర్ లో అకౌంట్ లేని వారు ఎవరు ఉన్నారు చెప్పండి.సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ వేదికలో ట్విట్టర్ పాత్ర చాలా ప్రముఖం అనే చెప్పాలి.

 Special Text Features In The Tweet Twitter In The Testing Phase , Twitter , New-TeluguStop.com

అలాగే ట్విట్టర్ కూడా ఎప్పటికప్పుడు తన యూజర్లను ఆకట్టుకునే దిశగా రాకరకాల సరికొత్త ఫీచర్లను తన యుజర్లకు పరిచయం చేస్తూ వస్తుంది.ముఖ్యంగా ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్ల కోసం యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది.

ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా మరొక సరికొత్త ఫీచర్‌ను మన ముందుకు తీసుకుని రాబోతుంది ట్విట్టర్.

మరి ఆ ఫీచర్ ఎలా ట్విట్టర్ యుజర్లకు ఉపయోగపడుతుందో తెలుసుకుందామా.

ఈ ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు ట్విట్టర్ యాప్ లో ట్వీట్స్ లోని తమకు కావాల్సిన టెక్స్ట్ ను కాపీ చేసుకోవచ్చు.అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో లేని కారణంగా వారు ట్వీట్ లోని టెక్స్ట్ మొత్తాన్ని కాపీ చేయాలిసిన పరిస్థితి వస్తుంది.

తమకు కావలిసిన కావాల్సిన మేటర్ మాత్రమే టెక్స్ట్ కాపీ చేయలేకపోతున్నారు.ఈ ఇబ్బందులను గమనించిన ట్విట్టర్ యాజమాన్యం ఇప్పుడు కొత్తగా ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్లు కోసం మన ముందుకు తీసుకుని వచ్చింది.

అంటే ఇకమీదట ట్వీట్ లోని కావాల్సిన టెక్స్ట్ ని కాపీ చేసి దానిని ఇతరులతో షేర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట.

Telugu Android, Copy Text, Ups, Text-Latest News - Telugu

ఈ అప్‌కమింగ్ ఫీచర్‌ గురించి లీకర్, హిడెన్ ఫీచర్ డిటెక్టివ్ జేన్ మంచున్ వాంగ్ ఓ ట్వీట్‌ ద్వారా తెలపడం జరిగింది.ఈ ట్వీట్ లో “ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సెలెక్ట్ టెక్స్ట్ ఆన్ ట్వీట్స్ ఫీచర్‌ ను ఎట్టకేలకు ఆండ్రాయిడ్ యూజర్ల ముందుకు తీసుకొచ్చేందుకు ట్విట్టర్ వర్క్ చేస్తోంది” అని వాంగ్ తెలిపారు.మరి ఆ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుందంటే ట్వీట్ లోని మేటర్ కాపీ చేసిన టెక్స్ట్.

దానిపై కాపీ, షేర్, సెలెక్ట్ అల్ అనే స్పెషల్ టెక్స్ట్ కనిపిస్తాయి వాటిని సెలక్ట్ చేసుకుని మీకు కావలిసిన మ్యాటర్ వేరే వారితో షేర్ చేసుకోవచ్చు.ఈ స్పెషల్ టెక్స్ట్ ఫీచర్స్ ను ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉంది.

త్వరలోనే అందరికి అందుబాటులోకి రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube