ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone Tapping Case )లో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు( SIB Former DSP Praneeth Rao ) కస్టడీలో సంచలన విషయాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది.
తనతో కలిసి పని చేసిన అధికారుల పేర్లను ప్రణీత్ రావు చెప్పారు.అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్ వేర్( Special Software ) ను తీసుకొచ్చి ఉపయోగించామని తెలిపారు.
దీని సాయంతో టెలిఫోన్ సర్వీసులకు ఎలాంటి సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశామని పేర్కొన్నారు.పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే మరికొంత మందికి నోటీసులు ఇవ్వనున్న పోలీసులు వారిని విచారించనున్నారు.