నేవల్ కళ్యాణి ఆసుపత్రికి 60 ఏళ్లు
గుర్తుగా పోస్టల్ కవర్ ఆవిష్కరించిన పోస్టల్ శాఖ తూర్పు నౌకాదళ కేంద్రంగా రక్షణ రంగ ఉద్యోగులకు సేవలు అందిస్తున్న ఐఎన్ఎస్ కళ్యాణి ఆసుపత్రి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.విశాఖలోని మల్కాపురం వద్ద ఉన్న కళ్యాణి ఆస్పత్రిలో కేవలం అనేవి ఉద్యోగులు మాత్రమే కాక సివిల్ ఉద్యోగులు… ఇతర త్రివిధ దళాల సిబ్బంది వైద్యపరమైన సేవలు అందుకుంటారు.
అత్యవసర సందర్భాల్లో విశాఖ వాసులకు పలు సందర్భాల్లో kalyani వైద్య సిబ్బంది సేవలు అందించారు.ఈ దశలో ఐ ఎన్ఎస్ కళ్యాణి డైమండ్ జూబ్లీ వేడుకలు సందర్భంగా పోస్టల్ విభాగం కొత్త పోస్టల్ కవరు విడుదల చేసింది విశాఖలోని వేలంపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ కవర్ను విడుదల చేశారు.