ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న రాక్షస పాలన యావత్ ప్రపంచాన్ని ఆందోళన చెందేలా చేస్తోంది.ఎంతో మంది ఆఫ్ఘాన్ పౌరులు ప్రాణభయంతో బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.
ఏ క్షణం ఎటువైపు నుంచీ తాలిబన్లు వచ్చి తమపై దాడులు చేస్తారో నని భయాందోళనలకు లోనవుతున్నారు.ఈ క్రమంలోనే ఎంతో మంది ఆఫ్ఘాన్ పౌరులు విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేస్తున్న సంఘటనలు మనం రోజూ చూస్తూనే ఉన్నాయి.
అయితే ఆఫ్ఘన్ లో చిక్కుకున్న మన భారతీయుల పరిస్థితి వారి మనో వేదన ఇంకెంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఆఫ్ఘాన్ లో వందలాది మంది భారతీయులు ఉన్నారు వారిని భారత్ రప్పించడానికి కేంద్రం అన్ని రకాల చర్యలు చేపడుతోంది.
అంతేకాదు ఆఫ్ఘాన్ నలుమూలలలో ఎక్కడెక్కడ భారతీయులు ఉన్నా వారు కేంద్రం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సంప్రదించవచ్చునని అందరిని సురక్షితంగా భారత్ తీసుకువెళ్తామని కేంద్రం ధైర్యం చెప్పింది.ఇప్పటికే కొందరు భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చిన కేంద్రం మిగిలిన వారిని తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇదిలాఉంటే ఏపీ ప్రభుత్వం ఆఫ్హాన్ లో ఉన్న తెలుగు వారి కోసం విజయవాడలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది.
ఆఫ్ఘాన్ లో చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం వారిని సురక్షితంగా భారత్ తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగానే రెండు టోల్ ఫ్రీ నెంబర్ లను ఏర్పాటు చేశారు.0866-2436314 , +917780339884 నెంబర్ లకు ఆఫ్ఘాన్ లో ఉన్న భారతీయుల వివరాలు చెప్పాలని తెలిపారు.వారి కుటుంభ సభ్యులు లేదా అక్కడ వారి వివరాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ హెల్ప్ డెస్క్ ను సంప్రదించవచ్చునని, కేంద్రంతో మాట్లాడి వారిని సురక్షితంగా ఏపీ తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని కార్మిక శాఖా అధికారులు ప్రకటించారు.ఈ టోల్ ఫ్రీ నెంబర్ లు కాకుండా మరో రెండు నంబర్స్ అదనంగా ప్రకటించారు అధికారులు.
+919492555089, 8977925653 ఈ నంబర్స్ ను కూడా సంప్రదిచంవచ్చునని అధికారులు ప్రకటించారు.