ఏపీలోని రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ తమ్మినేని సీతారాం ( Speaker Tammineni Sitaram )నోటీసులు జారీ చేశారు.పార్టీ ఫిరాయింపు ఆరోపణల నేపథ్యంలో విచారణకు రావాలంటూ స్పీకర్ తమ్మినేని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, మద్దాల గిరి విచారణకు హాజరు కావాలని తెలిపారు.

అదేవిధంగా వైసీపీ రెబల్స్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి( Anam Ramanarayana Reddy ) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని స్పీకర్ నోటీసులను అందజేశారు.అయితే ఇవాళ్టి విచారణకు రెబల్ ఎమ్మెల్యేలు హాజరు అవుతారా? లేదా? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







