నటుడిగా.నిర్మాతగా.నేపథ్య గాయకుడిగా.ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎస్పీ చరణ్ (S.P.Charan) అంటే అందరికీ సుపరిచితమే.ఈయన తండ్రి ఎస్పీ బాలసుబ్రమణ్యం చాలా భాషల్లో వేలాది పాటలు పాడి పేరున్న సింగర్ గా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
అయితే అలాంటి బాలసుబ్రమణ్యం (SP Bala Subramanyam) కొడుకుగా ఇండస్ట్రీకి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎస్పీ చరణ్ హీరోగా తనకు సెట్ అవ్వదని నటుడిగా మానేసి కొన్ని సినిమాలకు నిర్మాతగా అలాగే సింగర్ గా మారారు.
అయితే ఎస్పీ చరణ్ పై అప్పట్లో ఒక ప్రచారం జరిగింది.అదేంటంటే ఒక హీరోయిన్ ని రే** చేయాలని చూసారని అప్పట్లో తమిళ మీడియాలో వార్తలు వినిపించాయి.
మరి ఆ హీరోయిన్ ఎవరు.నిజంగానే ఎస్పీ చరణ్ ఆ అమ్మాయిని బలవంతం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడా.
అనే నిజం ఎప్పుడు తెలుసుకుందాం.
ఎస్పీ చరణ్ కి ఓ ప్రైవేట్ పార్టీలో డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) తమిళ నటి అయిన సోనా హైడెన్ ని( Sona Haiden ) పరిచయం చేశారట.
అయితే అంతకుముందే ఎస్పీ చరణ్ సోనా ఇద్దరితో ఒక సినిమా స్టార్ట్ అయ్యి మధ్యలోనే ఆగిపోయిందట.ఆ తర్వాత వీరిద్దరూ ప్రైవేట్ పార్టీలో( Private Party ) ఫుల్లుగా తాగి మత్తులో రూమ్ కి వెళ్ళారట.
ఇక రూమ్ కి వెళ్ళిన కొద్దిసేపటికే సోనా గట్టిగా అరవడంతో అక్కడే పార్టీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి డోర్ ఓపెన్ చేశారట.బయటికి వచ్చిన సోనా చరణ్ నన్ను బలవంతం చేశారని కన్నీళ్లు పెట్టుకుందట.
ఇక ఇదే విషయాన్ని పాండీబజార్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఒక్కసారి గా మీడియాలో వైరల్ అయింది.అయితే ఇందులో చాలామంది ఎస్పీ చరణ్ (S.P.Charan) ది తప్పు ఉందని నమ్మరు.ఎందుకంటే ఎస్పీ చరణ్ లేడీస్ మాన్ గా ఏ హీరోయిన్ తన కంట్లో పడితే ఆ హీరోయిన్ తో లవ్ ట్రాక్ నడిపేవాడని అప్పట్లో ఒక టాక్ ఉంది.ఇక చరణ్ ని పోలీసులు పిలిపించి అడగగా నేను మద్యం మత్తులో ఉండగా సోనా చేసిన పని వల్లే నేను ఆమెపై చేయి వేసాను.
అంతే అందులో నా తప్పులేదు అని చెప్పాడట.
అంతేకాదు ఆ తర్వాత రోజు సోనా హైడెన్ (Sona Haiden) హాస్పిటల్లో చేరి చరణ్ వల్ల తనకు గాయాలయ్యాయని మీడియాతో మాట్లాడుతూ చరణ్ నాకు వారం లోగా సారీ చెప్పకపోతే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతాను అని మాట్లాడడంతో బాలసుబ్రమణ్యం రంగంలోకి దిగి కేసు వెనక్కి తీసుకోకపోతే నా కొడుకు జీవితం నాశనం అవుతుంది అని సోనా హైడన్ ని బ్రతిమిలాడారట.కానీ సోనా మాత్రం నాకు 50 లక్షలు ఇస్తేనే కేసు కొట్టేస్తాను అని చెప్పడంతో 30 లక్షలకు మాట్లాడి 30 లక్షలు ఆమెకి ఇచ్చి తన కొడుకు పేరు మీద ఉన్న కేసును కొట్టేయించాడట.ఇక అప్పట్లో ఈ మ్యాటర్ పెద్ద సంచలనం సృష్టించింది.