SP Balasubramanyam: నయనతార సీత వేషం ఏంటి అని బాధ పడ్డాను : SP బాలు

బాపు దర్శకుడిగా కృష్ణ హీరో గా నటించిన సాక్షి చిత్రం తో 1967 లో కెరీర్ ను ప్రారంభించారు.

అయన చివరగా దర్శకత్వం వహించిన సినిమా 2011 లో శ్రీరామ రాజ్యం.

( Srirama Rajyam Movie ) దాదాపు 44 ఏళ్ళ కెరీర్ లో అయన తీసింది 47 సినిమాలు కాగా ఒక్కో చిత్రం ఒక్కో ఆణిముత్యం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.ఇక శ్రీరామరాజ్యం సినిమా బాపు రమణ ల కలల ప్రాజెక్ట్ .వీరిద్దరూ కలిసి చేసిన చివరి సినిమా కూడా ఇదే కావడం విశేషం.ప్రస్తుతం ఆ ఇద్దరు మహానుభావులు ఈ లోకం లో లేరు.

ఇక ఈ చిత్రానికి యలమంచిలి సాయి బాబు నిర్మాతగా వ్యవహరించారు. శ్రీ రామ రాజ్యం సినిమా విషయానికి వచ్చే సరికి రాముడిగా బాలయ్య బాబు నటించగా సీత పాత్రలో నయనతార ( Nayanthara ) నటించింది.

నయన్ ని సీత పాత్ర కోసం ఎంచుకోవడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.ఒక క్రిస్టియన్ గా పుట్టిన అమ్మాయి హిందూ పౌరాణిక చిత్రంలో నటించడం పట్ల హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసాయి.కానీ ఒక్క సారి సినిమా విడుదల అయ్యాక అందరి నోళ్లు మూత పడ్డాయి.

Advertisement

ఆఖరికి ఈ సినిమా లో అనేక పాటలు పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం( SP Balasubramanyam ) కూడా సీత పాత్రలో ఈవిడ నటించడం ఏంటి అని అనుకున్నారట.కానీ నయనతార ను సీత గా ప్రేక్షకులు ఒప్పుకోవడానికి సగం కారణం నయన్ నటన అయితే సగం కారణం నయన్ కి గాత్ర దానం చేసిన సింగర్ సునీత.

ఈ విషయాన్నీ ఎస్పీ బాలు కన్ను మూయక ముందు సవినయంగా క్షమాపణ చెప్తూ వీడియో చేసారు.సీత పాత్రకు ప్రాణం పోసింది సునీత అని, సీత లో ఉండే ఆర్ద్రత అంతా ఆమె మాటల్లో చూపించి అందరిని ఒప్పించగలిగింది అంటూ కొనియాడారు.నయనతార కూడా చక్కగా నటించడం తో ఈ సినిమాలో ఆమె సీతగా అందరి చేత ప్రశంసలు అందుకుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ చివరి రోజు నయనతార ఎక్కి ఎక్కి ఏడుస్తూ సినిమా యూనిట్ లో ఉండే అందరికి పాదాభివందనం కూడా చేయడం అప్పట్లో పెద్ద వైరల్ అంశం గా చెప్పుకోవచ్చు.నయన్ తన జీవితంలో చేసిన అతి ముఖ్యమైన, గొప్ప సినిమా శ్రీరామరాజ్యం అంటూ కొనియాడారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?
Advertisement

తాజా వార్తలు