ఎస్పీ బాలు బయోపిక్ చేస్తా అంటున్న నిర్మాత

ఈ మధ్యాకాలంలో బయోపిక్ లు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి.నిజ జీవిత కథలని తెరపై ఆవిష్కరించడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

బాలీవుడ్ లో ఇప్పటికే రియల్ లైఫ్ కథ ప్రభావంలో బయోపిక్ ల రూపంలోకి వస్తున్నాయి.అవి సక్సెస్ అవుతూ ఉండటంతో వాటినిపై దర్శకులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

ఇక సౌత్ లో బయోపిక్ కథలు తెరకేక్కుతున్నవి తక్కువగానే ఉన్నాయి.అలాగే సక్సెస్ రేట్ కూడా తక్కువగానే ఉంది.

ఈ కారణంగానే దర్శక, నిర్మాతల ఈ కథల విషయంలో ధైర్యం చేయడం లేదు.రియల్ లైఫ్ ఎమోషన్స్ లో రీల్ లో ఆవిష్కరించడంలో మన దర్శకులు కూడా విఫలం అవుతున్నారు.

Advertisement

ఇదిలా ఇప్పుడు ఓ బయోపిక్ ని తెరకెక్కిస్తా అని ఓ నిర్మాత ముందుకొచ్చారు.స్వర దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో మృత్యువాత పడిన సంగతి అందరికి తెలిసిందే.

దిగ్గజ గాయకుడుగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బయోపిక్ ని తెరకెక్కించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు నిర్మాత, శుభోదయం గ్రూపు చైర్మన్ శ్రీలక్ష్మీ ప్రసాద్ ప్రకటించాడు.

మార్చ్ 1న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నివాళిగా 60 మంది గాయకులతో ఈయన ఓ కార్యక్రమం నిర్వహించారు.దీనికి హృదయాంజలి అనే పేరు పెట్టారు.

ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ ఆధ్వర్వంలో ‘హృదయాంజలి’ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో 60 మంది గాయకులు బాలుకు నివాళిగా పాటలు పాడారు.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

ఆయన బయోపిక్ తనకు తీయాలని ఉందని, కాకపోతే దానికి తన ఒక్కడి నిర్ణయం సరిపోదని లక్ష్మీప్రసాద్ చెప్పాడు.ఎస్పీ బాలు కుటుంబం కూడా అంగీకరిస్తే వెంటనే బాలు బయోపిక్ మొదలు పెడతానానని మీడియా సాక్షిగా ప్రకటించారు.

Advertisement

మరి దీనికి ఎప్సీ బాలు కుటుంబ సభ్యులు ఎంత వరకు అంగీకరిస్తారు అనేది చూడాలి.

తాజా వార్తలు