బాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే.నటిగా కంటే వ్యక్తిగత విషయం లోనే బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.
ఇక తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.తన నటనకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ముక్కుసూటి నటి గా నిలిచి ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకుంది.
2004లో ఐ లవ్ యు బాస్ అనే సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కంగనా రనౌత్.ఇక ఈ సినిమాలో తన తొలి నటనతోనే మంచి సక్సెస్ అందుకుంది.అలా ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ సినిమాలో కూడా నటించింది.
ఇక కంగనా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
నిత్యం ఏదో ఒక విషయం తో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది.తన నోటికి వచ్చిన మాటలతో అందరిని వణికిస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ స్టార్స్ ని పొగుడుతూ బాలీవుడ్ స్టార్ ని ఏకిపారేసింది.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.

తన సోషల్ మీడియా ద్వారా టాలీవుడ్ స్టార్ హీరోల ఫోటోలను షేర్ చేసుకుంది.అందులో అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, యష్ లు ఉన్నారు.ఇక అందులో యష్ తన భార్య పిల్లలతో కలిసి పూజ చేస్తున్నట్లు కనిపించగా, రామ్ చరణ్ అయ్యప్ప మాల లో, ఎన్టీఆర్ హనుమాన్ మాల లో కనిపించారు.ఇక అల్లు అర్జున్ తన సోదరులతో కలిసి పూజ చేస్తున్నట్లు కనిపించాడు.

దీంతో కంగనా ఈ ఫోటోలకు.సౌత్ సూపర్ స్టార్స్ ఎంతో ఒదిగి ఉంటూ.తమ సంస్కృతిని కాపాడుకుంటూ ఉంటారు అని తెలిపింది.మొత్తానికి టాలీవుడ్ స్టార్ ని పొగుడుతూ బాలీవుడ్ స్టార్లను ఏకి పారేసింది కంగనా.







