బాలివుడ్ కి, దక్షిణాదికి మధ్య తేడాలు చెబుతున్న కాజల్

అందాల తార కాజల్ అగర్వాల్ బాలివుడ్ లో తన అదృష్టాన్ని తిరిగి పరీక్షించుకుంటోంది .

రణదీప్ హూడా హీరోగా కాజల్ నటించిన "దో లఫ్జోన్ కి కహాని " నిన్నే విడుదలైంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగానే కష్టపడింది కాజల్.డజనుకి పైగా ఇంటర్వ్యులు ఇచ్చింది.

ఒక ఇంటర్వ్యులో తన అభిమానుల గురించి మంచి మాటలు చెప్పింది ఈ భామ.బాలివుడ్ ఫ్యాన్స్ కి, దక్షిణాది ఫ్యాన్స్ కి మధ్య తేడా కూడా చెప్పుకొచ్చింది." దక్షిణాదిలో అభిమానులు చాలా లోయల్ గా ఉంటారు.

ఒకటి రెండు సినిమాలు అపజయం పాలైనా, పరిస్థితులు బాగా లేకున్నా, తమకు ఇష్టమైన స్టార్ ను వీడరు.బాలివుడ్ లో అలా కాదు.ఇక్కడి అభిమానులు రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే రూటు మార్చేస్తారు.

Advertisement

దక్షిణాదిలో ఎదిగిన హీరోయిన్ ని కాబట్టి అక్కడి సినిమాలు అంటే సహజంగానే కొంచెం ఎక్కువ ఇష్టం.కాని బాలివుడ్, టాలివుడ్ లో ఒక్కటి ఎన్నుకోవాలంటే మాత్రం కష్టం " అంటూ ముగించింది కాజల్.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?
Advertisement

తాజా వార్తలు