Soundarya :ఆ డైరెక్టర్ చేసిన పనికి నిద్ర మాత్రలు మింగేసిన సౌందర్య.. అంత టార్చర్ చేశారా..?

నటి సౌందర్య ( Soundarya ) తెలుగు, తమిళ, కన్నడ, హిందీ,మలయాళ భాషల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది.అలాంటి ఈ ముద్దుగుమ్మ ఎంబిబిఎస్ చదువుతున్న సమయంలోనే గంధర్వ అనే సినిమాలో అవకాశం రావడంతో అందులో నటించింది.

 Soundarya Who Swallowed Sleeping Pills For The Work Done By That Director-TeluguStop.com

ఆ తర్వాత అమ్మోరు ( Ammoru ) సినిమాలో చేసింది.ఈ సినిమా హిట్ అవ్వడంతో ఎంబిబిఎస్ చదువు మధ్యలోనే ఆపేసి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.

ఎలాంటి గ్లామరస్ పాత్రలో నటించకపోయినా కూడా ఈ ముద్దుగుమ్మ చాలా క్రేజ్ ఉండేది.అయితే 2004లో బిజెపి పార్టీకి సపోర్టుగా ఓ సభ లో ప్రసంగించడం కోసం ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళిన సమయంలో విమాన ప్రమాదంలో మరణించింది.

Telugu Ammoru, Gandharva, Kannada, Soundarya-Latest News - Telugu

అయితే ఈ హీరోయిన్ చనిపోయి దాదాపు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి సౌందర్యను మర్చిపోలేకపోతున్నారు.ఇప్పటి జనరేషన్ వాళ్లకు కూడా సౌందర్య ఫేవరెట్ హీరోయిన్ గా ఉంది.అంతే కాదు చాలా మంది స్టార్ హీరోలకు కూడా సౌందర్య అంటే ఎంతో ఇష్టం.అయితే అలాంటి సౌందర్య ఓ డైరెక్టర్ చేసిన పనికి నిద్రమాత్రలు మింగిందట.

ఇక అసలు విషయం ఏంటంటే.సౌందర్య కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ,హిందీ భాషల్లో కూడా చేసింది.

అయితే కన్నడ సినిమాలో నటిస్తున్న సమయంలో ఓ కన్నడ డైరెక్టర్ షూటింగ్( Kannada director shooting ) సమయంలో సౌందర్యను చాలా ఇబ్బంది పెట్టారట.

Telugu Ammoru, Gandharva, Kannada, Soundarya-Latest News - Telugu

అయితే ఈ సినిమా షూటింగ్ చేసే సమయంలో వేరే సినిమాకి కూడా డేట్స్ ఇవ్వడం వల్ల ఈ సినిమాకి డేట్స్ తక్కువయ్యాయి.దాంతో టైం లేకపోవడం తో డైరెక్టర్ సౌందర్య తో రెండు రోజులు చేసే షూటింగ్ ని ఒకేరోజు కంప్లీట్ చేశారట.అలా షూటింగ్ కంప్లీట్ చేసుకుని అర్ధరాత్రి వచ్చేసరికి ఆమెకు సరిగ్గా నిద్ర కూడా పట్టకపోయేదట.

దాంతో మళ్లీ ఎర్లీ మార్నింగ్ లేవాలి అనే ఉద్దేశంతో డాక్టర్ సజేషన్ ని తీసుకొని తక్కువ డోస్ తో ఉన్న నిద్ర మాత్రలు తీసుకునేదట.అలా నిద్ర మాత్రలు మింగి పడుకొని మళ్లీ ఉదయాన్నే లేచేదట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube