GVL Narasimha Rao : త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తా..: జీవీఎల్

ఏపీ బీజేపీ నేత జీవీఎల్ నరసింహ రావు( GVL Narasimha Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.

విశాఖ అభివృద్ధి( Visakha Development ) కోసం భవిష్యత్ లో కూడా కృషి చేస్తానన్నారు.

అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోవడంతో చాలా మంది కలత చెంది ఫోన్లు చేస్తున్నారని పేర్కొన్నారు.తన పరిధిలో ఉన్న సమస్యలన్నింటీనీ పరిష్కరించానని తెలిపారు.

నిస్వార్థంగా సేవ చేశానన్న జీవీఎల్ అదంతా వృధా అయిందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అవుతుందన్నారు.జీవీఎల్ ఫర్ వైజాగ్( GVL For Vizag ) అనేది నిరంతర ప్రక్రియని చెప్పారు.

ఈ క్రమంలోనే త్వరలోనే విశాఖకు వస్తానన్న జీవీఎల్ తన అనుచరులతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తానని తెలిపారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు