కాసేపట్లో తెలంగాణలో మహాలక్ష్మీ ఉచిత బస్సు స్కీం ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహాలక్ష్మీ ఉచిత బస్సు స్కీం ప్రారంభం కానుంది.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి పథకాన్ని ప్రారంభించనున్నారు.

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఈ పథకానికి ఇవాళ శ్రీకారం చుట్టారని తెలుస్తోంది.కాగా ఆరు గ్యారెంటీలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుంది.

ఈ స్కీం లో భాగంగా మహిళలు, బాలికలతో పాటు ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనుండగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తెలంగాణ పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు.మహాలక్ష్మీ పథకం ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించనున్నారు.ఈ పథకం ద్వారా పేదలందరికీ రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించనుంది.

ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?
Advertisement

తాజా వార్తలు