తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే.ఎన్నో దీర్ఘకాలిక రోగాలను నయం చేయగలిగే సత్తా తులసి మొక్కలు ఉంది.
ఆయుర్వేద మందులలో ఎక్కువగా తులసిని ఉపయోగిస్తారు.కాబట్టి తులసి పంటకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులు( Farmers ) ఈ పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఏ పంటను సాగు చేసినా చీడపీడలు, తెగుళ్లు లాంటివి ఆశించకుండా కొన్ని మెలకువలతో సాగు చేపడితే.పెట్టుబడి భారం, శ్రమ తగ్గడంతో పాటు అధిక దిగుబడి( High yield ) సాధించి మంచి లాభాలు పొందవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు సూచిస్తున్నారు.

తులసి పంట సాగుకు ( Tulsi Cultivation )దాదాపుగా అన్ని రకాల భూములు అనుకూలంగానే ఉంటాయి.ఈ పంటను ప్రకృతి సిద్ధంగా సాగు చేయవచ్చు.నీరు నిల్వ ఉండే నేలలు ఈ పంట సాగుకు పనికిరావు.పర్వత ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు తులసి సాగుకు చాలా అనుకూలం.వేసవి కాలంలో ఒకసారి లోతుగా నేలను దుక్కి దున్ని పశువుల ఎరువు వేసి బాగా కలియదున్నాలి.ఆ తర్వాత పొలంలో పంట అవశేషాలు ఏమైనా ఉంటే పూర్తిగా తొలగించాలి.
తులసి మొక్కలు నాటడానికి ముందు మరొకసారి నేలను దున్ని చదును చేసి రసాయనిక ఎరువులు( Chemical fertilizers ) వేసి నాగలితో సాల్లు తోలుకోవాలి.

ఇక తులసి మొక్కలను 40-40 సెంటీమీటర్ల అంతరంలో నాటుకోవాలి.ఇలా నాటుకుంటే పంటకు వివిధ రకాల తెగుళ్లు ఆశించే అవకాశం ఉండదు.మొక్కలు నాటిన నెలలోపు పొలంలో కలుపు మొక్కలను పీకేయాలి.
ఆ తర్వాత 60 రోజులకు మరొకసారి కలుపు మొక్కలను( Weeds ) పీకేయాలి.వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేలలో తేమశాతాన్ని బట్టి పొలానికి నీటి తడులు అందించాలి.
మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నప్పుడు పంట కోతలు చేయాలి.మొక్కలకు ఏవైనా తెగుళ్లు లేదా చీడపీడలు ఆశిస్తే ఆ మొక్కను పీకేసి నాశనం చేయాలి.
నీటిని రాత్రి సమయంలో కాకుండా పగటిపూట మాత్రమే పంటకు అందించాలి.







