Sonu sood Chai Vali : గ్రాడ్యుయేట్ చాయ్ వాలీకి సోనూ ఆర్ధిక సాయం.. .. త్వరలో టీ కోసం వస్తా అంటూ ట్విట్..

చదువుకుని ఉద్యోగ ప్రయత్నం చేసింది.అయినప్పటికీ ఉద్యోగం రాలేదు.

 Sonu Financial Help For Graduate Chai Vali , Sonu Sood, Bollywood , Graduate, C-TeluguStop.com

దీంతో తనకు తానె ఉపాధి కల్పించుకోవాలని భావించి సొంతంగా టీ దుకాణాన్ని ప్రారంభించి ఫేమస్ అయింది ప్రియాంక గుప్తా.గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ యజమాని.

ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసినా సరైన ఉద్యోగం రాకపోవడంతో చాయ్ వాలీగా మారింది. పాట్నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల టీ దుకాణాన్ని జప్తు చేయడంతో.

మళ్ళీ ప్రియాంక కష్టాలు మొదలయ్యాయి.ఈ సందర్భంగా తాను ఎదుర్కొంటున్న పరిస్థితిని తన నిస్సహాయ స్థితిని వీడియో ద్వారా వివరించింది.

తాజాగా ప్రియాంక కష్టాలపై సోనూసూద్ స్పందించాడు . రియల్ హీరో ప్రియాంక గుప్తాకు కొత్త టీ దుకాణం ఏర్పటు చేసుకోవడం కోసం సహాయం చేశాడు.దీంతో తన కొత్త టీ స్టాల్ ను మళ్ళీ ఓపెన్ చేయనుంది.సోనూసూద్ చేసిన ఈ సహాయానికి అభిమానులు బాసు నువ్వు సూపర్ అని అంటున్నారు.

కరోనా వెలుగులోకి వచ్చిన.లాక్ డౌన్ విధించినప్పటి నుంచి సోనూ సూద్ ప్రజలకు సహాయం చేస్తూనే ఉన్నాడు.

కష్టాల్లో ఉన్న వ్యక్తులకు అండగా నిలబడి ఆర్ధికంగా భరోసా నిస్తూ.రియల్ హీరో అయ్యాడు.

ఇప్పటికే అనేక మందికి శస్త్రచికిత్సలను చేయించాడు.నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాడు.

ఎంతో మందికి చదువు కోసం డబ్బు సాయం చేశాడు.ఇప్పుడు ప్రియాంక గుప్తాకి కూడా సాయం అందించాడు.

తాను భిన్నంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నానని .తన నిర్ణయానికి ప్రజలు మద్దతు పలికారని .అయితే ఇది బీహార్.ఇక్కడ మహిళల స్థానం వంటగదికే పరిమితం అంటూ ప్రియాంక కన్నీరు పెట్టుకున్నారు.

పాట్నాలో అనేక అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి.వీటిని అరికట్టే విధంగా అధికారులు పనిచేయడం లేదు.

కానీ ఓ అమ్మాయి సొంత వ్యాపారం చేసుకుంటే పదే పదే అడ్డుతగులుతున్నారు’’ అని ప్రియాంక గుప్తా కన్నీరుతో అభ్యర్ధిస్తున్న ఓ వీడియో రిలీజ్ ను కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసింది.

ప్రియాంక గుప్తా వీడియో వైరల్‌గా మారడంతో సోనూసూద్ దీనిపై స్పందించా రు.‘ప్రియాంక టీ దుకాణం ఏర్పాటు చేయడానికి ఆర్ధికంగా అండగా బిలబడ్డారు.తాను బీహార్ వెళ్ళినప్పుడు ఆమె దుకాణంలో టీ రుచి చూస్తాను” అని సోనూసూద్ ట్వీట్ చేశారు.

ఇప్పుడు ప్రియాంక గుప్తా తన టీ షాప్ బ్రాంచ్‌ను వివిధ ప్రాంతాల్లో ప్రారంభించాలని ఆలోచిస్తుంది.ఈ మేరకు ప్రియాంక సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.

ప్రియాంక తో పాటు.తాము కూడా చాయ్ వాలీగా పనిచేయడానికి అనేక మంది ఆసక్తిని చూపిస్తున్నారు.

Actor Sonu Sood helps Bihar's Graduate Chaiwali

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube