బికినీ వేయమని మీ అమ్మని అడుగు అనేసిన హీరోయిన్

సోషల్ నెట్వర్కింగ్ వెబ్స్ సైట్స్ రావడం వల్ల ఎంతపెద్ద వ్యక్తికైనా సందేశం పంపే సౌలభ్యం మనకి దొరికింది.కాని దాన్ని ఎలా వాడుకోవాలి అలా వాడుకుంటేనే మంచిది.

 Sonakshi Gets Angry When A Fan Asked Her To Wear Bikini-TeluguStop.com

వెర్రి వేషాలు వేస్తే ఏం జరుగుద్దో నిన్న సోనాక్షి సిన్హా చూపించింది.అసలేం జరిగిందంటే … అప్పుడప్పుడు సినీతారలు, ఆటగాళ్ళు తమ అభిమానులతో చాట్ చేస్తూ ఉంటారు కదా, అలానే చాట్ చేద్దాం అని నిన్న సోనాక్షి అడిగేసరికి చాలామంది రకరకాల ప్రశ్నలు వేసారు.

కాని ఒక ఆకతాయి, ” నీ శరీరాన్ని ఎప్పుడు చూపిస్తావ్ ? , బికినీ ఎప్పుడు వేసుకుంటావు ?” అని అడిగేసాడు.అది చుసిన సోనాక్షికి పట్టలేనంత కోపం వచ్చేసింది.“ఇదే ప్రశ్న మీ అమ్మనో, అక్కనో అడుగు, వాళ్ళు ఏమంటారో నాకు చెప్పు ” అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది సోనాక్షి.

అక్కడితో ఆగకుండా ఆ అబ్బాయి ట్వీట్ ని పబ్లిక్ గా పెట్టి తన పరువు తీసింది.

ఇంతలో ఎవరో అమ్మాయి వచ్చి ” డబ్బుల కోసం చర్మాన్ని అమ్మేసుకునే హీరోయిన్లే నీతులు చెప్పాలి ” అని సోనాక్షిని అనేసరికి హీరో వరుణ్ ధవన్ కలుగజేసుకొని ఆ అమ్మాయిని తిట్టేసాడు.దాంతో నిన్నటి రోజంతా ట్విట్టర్ గరం గారంగా ఉండింది.

ఆ అబ్బాయి సోనాక్షి క్షమాపణ చెప్పి పెట్టిన ట్వీట్ ని డిలీట్ చేయమని చాలాసేపు ప్రాధేయపడ్డాడు.చాలాసేపు ట్వీట్ ని అలానే ఉంచిన సోనాక్షి చివరికి తన టైంలైన్ నుంచి తొలగించేసింది.

దాంతో ఆ ఆకతాయి ఊపిరి పీల్చుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube