సన్నాఫ్ సత్యమూర్తి పాప.. ఇప్పుడేంటి ఇలా తయారైంది?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది మొదట చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత హీరో హీరోయిన్ లుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు.అయితే కొందరు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ మంచి క్రియేట్ సంపాదించుకోవడానికి చాలా సమయం పట్టగా మరి కొంతమందికి మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే సూపర్ క్రేజ్ ని దక్కించుకుంటూ ఉంటారు.

 Son Of Satyamurthy Fame Baby Vernika Latest Look Pics Viral, Son Of Sathyamurthy, Tollywood, Latest Photos, Baby Vernika, Allu Arjun-TeluguStop.com

ఇప్పుడు మనం తెలుసుకోబోయే చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అదే కోవ కి చెందుతుంది.ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదు సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన బేబీ వర్ణిక.

ఈ సినిమాలో అల్లు అర్జున్ కి మేనకోడలుగా నటించిన విషయం తెలిసిందే.కాగా 2015 లో విడుదలైన ఈ సినిమాలో స్వీటీ క్యారెక్టర్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ణిక.

 Son Of Satyamurthy Fame Baby Vernika Latest Look Pics Viral, Son Of Sathyamurthy, Tollywood, Latest Photos, Baby Vernika, Allu Arjun-సన్నాఫ్ సత్యమూర్తి పాప.. ఇప్పుడేంటి ఇలా తయారైంది-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత నాన్నకు ప్రేమతో సినిమాలో చిన్నప్పటి రకుల్ ప్రీతిసింగ్ పాతలో నటించింది.ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది వర్ణిక.అంతేకాకుండా ఈ రెండు సినిమాలు కూడా వర్ణికకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత వర్ణిక మళ్లీ సినిమాలలో కనిపించలేదు.

Telugu Allu Arjun, Baby Vernika, Latest, Tollywood-Latest News - Telugu

కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది వర్ణిక.ఇకపోతే వర్ణిక ప్రస్తుతం తన చదువులపై దృష్టి పెట్టిందని అందుకే సినిమాలకు దూరంగా ఉంటుందని తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే ఏడేళ్ల కిందట చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసిన వర్ణిక ప్రస్తుతం ఎలా ఉందో అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా సన్నాఫ్ సత్యమూర్తి సినిమా సమయంలో పాప రోల్ కోసం చైల్డ్ ఆర్టిస్టులను ఆడిషన్స్ చేద్దామనుకున్నారట దర్శకుడు త్రివిక్రమ్.

కానీ అంతలోనే బేబీ వర్ణిక ఫోటోలు కనిపించి నచ్చడంతో వెంటనే వర్ణిక తల్లిదండ్రులను ఒప్పించి సినిమాలో పరిచయం చేశారట దర్శకుడు త్రివిక్రమ్.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బేబీ వర్ణిక తాజా ఫోటోలు వైరల్ అవుతుండగా ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ తప్పకుండా ఈమె హీరోయిన్ అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube