తెలుగు రాష్ట్రాల్లో మాస్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అతికొద్ది మంది స్టార్ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరనే సంగతి తెలిసిందే.తన యాక్టింగ్ తో తారక్ తన అభిమానులతో పాటు ఇతర రాష్ట్రాల అభిమానులను, విదేశీ అభిమానులను సైతం మెప్పించారనే సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ మూవీలోని కొన్ని సన్నివేశాల్లో తారక్ నటన అద్భుతం అంటూ ప్రశంసలు వ్యక్తమయ్యాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీకెరీర్ లో ఆది, సింహాద్రి, యమదొంగ, జనతా గ్యారేజ్, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ లాంటి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు ఉండగా ఆ సినిమాలను మించిన విజయాలను తర్వాత సినిమాలతో అందుకోవాలని తారక్ కోరుకుంటున్నారు.
అయితే తారక్ ఆస్కార్ బరిలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుండటంతో తారక్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
అమెరికాలోని ప్రముఖ మూవీ పబ్లికేషన్ లో ఒకటైన వెరైటీ పబ్లికేషన్ ఆస్కార్ నామినేషన్స్ లో తారక్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని వెల్లడించడం గమనార్హం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతుండటంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.ఈ వార్త నిజమైతే టాలీవుడ్ నుంచి ఆస్కార్ రేసులో ఉన్న తొలి హీరోగా తారక్ రికార్డ్ ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఇదే అంటూ మరి కొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఎలాంటి ఎక్స్ ప్రెషన్ అయినా అద్భుతంగా పలికించే తారక్ తర్వాత సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.ఈ సినిమా పూర్తైన వెంటనే తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుంది.







