జనసేన బీజేపీ పొత్తు పై వీర్రాజు క్లారిటీ ! బద్వేల్ కి పవన్ ..?

ఏపీ లో బిజెపి జనసేన పార్టీల పొత్తు విషయంలో నెలకొన్న సందిగ్ధత పై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి.

రెండు పార్టీలు త్వరలోనే పొత్తు అధికారికంగా రద్దు చేసుకోబోతున్నాయి అని, టిడిపితో జనసేన జతకట్టబోతోంది అని, చాలాకాలం నుంచి బీజేపీ తీరుపై పవన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని, ఎంతో కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది.

దీనికి తగ్గట్లుగానే రెండు పార్టీలు ఉమ్మడిగా ఏపీలో పోరాటాలు చేయకపోవడం,  ఏ విషయంలోనూ రెండు పార్టీలు ఒకే వైఖరితో లేకపోవడం , ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేస్తుండడం,  ఇలా ఎన్నో అంశాలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తూ వస్తున్నాయి.దీనికి తగ్గట్టుగానే బద్వేలు నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయదు అంటూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

 జనసేన తో పొత్తు పెట్టుకున్న  బీజేపీ ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా అభ్యర్థిని నిలబెడతామని ,పోటీ చేసి తీరుతామని ప్రకటించడంతో ఈ రెండు పార్టీల పొత్తు విషయంలో అందరి  అనుమానాలు  నిజమైనట్టు గానే కనిపించాయి.అయితే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు . బద్వేలు నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికల్లో బిజెపి పోటీ చేస్తుందని, అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా ఒక క్లారిటీ కి రాలేదని, చర్చలు జరుపుతున్నామని వీర్రాజు చెప్పుకొచ్చారు.అంతేకాదు బద్వేల్ లో ఉప ఎన్నికల ప్రచారానికి పవన్ ని ప్రచారానికి రావాలని తాము కోరుతున్నట్లు వీర్రాజు తెలిపారు.

జనసేన బీజేపీ పార్టీల పొత్తు భవిష్యత్తు లోనూ కొనసాగుతుందన్నారు.టిడిపి జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయనే విషయంపై తాను స్పందించినట్టు వీర్రాజు చెప్పారు.అయితే సోము వీర్రాజు పిలిచినా పవన్ బద్వేల్ ప్రచారానికి వచ్చే అవకాశమే ఉండదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Advertisement
పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 

తాజా వార్తలు