విశాఖ భూ దందాలపై సోము వీర్రాజు తీవ్ర విమర్శలు

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖలో మీడియాతో మాట్లాడారు.సోము వీర్రాజు స్పందిస్తూ, విశాఖలో భూ దందాలకు పాల్పడ్డవారిపై విచారణకు గతంలో సిట్ వేశారని వెల్లడించారు.

 Somu Veeraju Criticizes The Visakha Land Grabs-TeluguStop.com

అయితే, టీడీపీ, వైసీపీ ఆ సిట్ నివేదికలను బహిర్గతం చేయలేదని తెలిపారు.నిందితులతో రెండు పార్టీలు కుమ్మక్కవడం వల్లే నివేదికలు బయటికి రాలేదని సోము వీర్రాజు ఆరోపించారు.జీవీఎల్ మాట్లాడుతూ, విశాఖ భూభాగోతాలపై ఈ నెల 11న గవర్నర్ కు లేఖ రాశానని వెల్లడించారు.22ఏ కింద ఉన్న భూముల విషయమై నిర్ణయం తీసుకోవాలని కోరామని తెలిపారు.బీజేపీ ఒత్తిడి వల్లే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని అన్నారు.సిట్ నివేదికలు బయటపెట్టకపోతే ఎవరినీ వదలబోమని హెచ్చరించారు.విశాక భూ దందాలో టీడీపీ, వైసీపీ నేతల పాత్ర ఉందని జీవీఎల్ స్పష్టం చేశారు.కాగా, విశాఖలో పవన్ కల్యాణ్ పై ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని సోము వీర్రాజు తెలిపారు.

విజయవాడలో పవన్ కల్యాణ్ ను కలిసి సంఘీభావం తెలిపామని పేర్కొన్నారు.విశాఖ ఘటనపై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసిందని, సరైన సమయంలో చర్యలు ఉంటాయని సోము వీర్రాజు వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube