ఏపీ సీఎం జగన్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంలో, విమర్శలు చేయడంలో ముందు వరుసలో ఉండేది బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.సందు దొరికినప్పుడల్లా జగన్ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంటాడు.
ఇది అందరికి తెలిసిన విషయమే.ఇలాంటి నేతకు ప్రస్తుతం ఒక చిక్కొచ్చి పడింది.
మొత్తంగా ఏపీ జగన్ సర్కార్‌పై విరుచుకుపడడమే టార్గెట్ అన్నట్టు ఉంది.ఇటీవల విద్యుత్ చార్జీల పెంపు అవకాశంగా మారింది.
ఇదే అదును అన్నట్టు జగన్‌పై సోము విరుచుకుపడ్డారు.
సామాన్యులపై జనగ్ ప్రభుత్వం విద్యుత్ చార్జీల బాదుడును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైసీపీ నిర్వాకంతో భారీగా విద్యుత్ చార్జీలు పెరిగాయని ఆరోపించారు.ఈ లెక్కన 30 యూనిట్ల వారికి యూనిట్‌కు 45పైసలు పెంచారన్నారు.31-75 యూనిట్ల వారికి యూనిట్‌కు 95 పైసలు, 126-225 వరకు యూనిట్‌కు రూ.1.57 పెంచారన్నారు.అయితే 226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.16 పెంచారన్నారు.400 యూనిట్లు ఆపైన వారికి యూనిట్‌కు రూ.0.55పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారన్నారు.వీటన్నింటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
లేదంటే తమ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.

ప్రతిపక్షంగా ప్రజల తరపును తన గళం విప్పడం మంచిదే.అయితే జనాలకు ఏమీ తెలియదా ? వాళ్లేమైనా పిచ్చోళ్లా…? అందుకు సోము వీర్రాజుకు ప్రశ్నలతో ఏకిపారేస్తున్నారు.సోము సార్… జగన్ ప్రభుత్వంను ఏకిపారేయండి.
మా సపోర్టు కూడా పూర్తిగా ఉంటుంది.విద్యుత్ చార్జీల భారం మోపుతున్న జగన్‌ను వదిలిపెట్టకండి.
అయితే సోము సార్….ఇదే సమయంలో మోడీని కూడా ఉతికారేయండంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఎదుకంటే రాత్రికిరాత్రే గ్యాస్ బండల ధరలు రూ.50 చొప్పున పెంచారని, ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ధరలు పెంచారని అంటున్నారు.దీనిపై కూడా మోడీని సోము సార్ ఏకిపారేయాలని అంటున్నారు.పెంచిన పెట్రోల్, డీజిల్ చార్జీలను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.మరి సోము సార్… ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి.







