పోలీసులంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీ ఉద్యోగులు కాదని ధ్వజమెత్తిన సోమిరెడ్డి అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన కుమారుడిని గోడలు దూకి వెళ్లి మరీ అరెస్ట్ చేస్తారా దుస్తులు మార్చుకోవడానికి, చెప్పులు వేసుకోవడానికి అంగీకరించనంత కిరాతకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలతో పోలిస్తే ఎమర్జెన్సీ రోజులే మేలనిపిస్తున్నాయి శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు గోడలు దూకడం, అక్రమ అరెస్టులు చేయడం, హింసించడానికి పరిమితమయ్యారు
పోలీసుల తీరు చూసి సామాన్యులు కూడా తప్పుదారిన నడిచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.చట్టానికి చేతుల్లోకి తీసుకుని పోలీసులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం దుర్మార్గం పోలీసులంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ఉద్యోగులు కాదని గుర్తుంచుకోండి.
ఎన్నిమార్లు కోర్టులు చీవాట్లు పెట్టిన పోలీసు అధికారుల్లో కొంచెం కూడా మార్పు రాకపోవడం దురదష్టకరం వెంటనే అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన కుమారుడిని విడుదల చేయడంతో పాటు ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి