ఆ హీరో-హీరోయున్ మధ్య అంత మ్యాటర్ ఉందా!

ఆమె ఒక యువ హీరోయిన్, తెలుగు సినిమాలు నాలుగేళ్ళుగా చేస్తోంది.తొలిచిత్రంలోనే మంచి మార్కులు కొట్టేసి ఇప్పడున్న క్రేజి కథానయికల్లో ఒకరిగా వెలుగుతోంది.

అతనొక యువ హీరో.చెసింది తక్కువ సినిమాలే అయినా, బాక్సాఫీస్ దగ్గర మంచి ట్రాక్ రికార్డే ఉంది.

చేతిలో అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.

ఈ ఇద్దరు కలిసి నటించారు.

ఇద్దరి మధ్య ఎదో ఉన్నట్లు వార్తలు రావడం మొదలైంది.ఆ ఏముందిలే మీడియా కలిసి కనబడినా, లింకులు పెట్టేస్తారు అనుకున్నారంతా.

కాని నిజంగానే ఇద్దరి మధ్య చాలా ఉంది.అది ఎంత అంటే ఒకరికోసం ఒకరు కథలు వినేంతా !

ఈ మధ్య ఓ రచయిత వెళ్లి సదరు హీరోయున్ కి ఓ కథ చెప్పాడు.

కథ బాగుంది అని మెచ్చుకుంది ఆ హీరోయిన్.ఆ హీరో కోసం కూడా వేరే కథ ఉంది అని చెప్పాడు ఆ రచయిత.

అప్పుడా హీరోయిన్ తన కథ నాకెందుకు చెప్పడం అని చివాట్లు పెట్టకుండా నాకు చెప్పు, నాకు చెబితే తనకి చెప్పినట్టే, ఈ కథ కూడా నచ్చితే తనకి నేనే రికమండ్ చేస్తా అని సమాధానం ఇచ్చింది.

ఏదో చీకట్లో బాణం వేస్తే, ఆ ఇద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందని అర్థం అయిపోయింది ఆ రైటర్ కి.ఎంత ప్రేమ లేకపోతే మాత్రం, రూమర్స్ వస్తున్నాయని తెలిసి కూడా, నేను చెబితే తను ఒప్పుకుంటాడు అని తమ మధ్య ఉన్న చనువుని బయటపెడుతుంది ఆ హీరోయిన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube