నిద్రించే టైంలో గురక విపరీతంగా వస్తుందా? అయితే ఇవి తెలుసుకోండి!

గురక.దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.చాలా మంది నిద్రించే సమయంలో గురక వస్తుంటుంది.మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక సమస్య(Snoring) ఎక్కువగా ఉంటుంది.గుర‌క వల్ల మనకు పెద్దగా సమస్య ఏమి ఉండదు.కానీ తమ ప‌క్క‌న నిద్రించే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

 How To Stop Snoring Naturally! Snoring, Snoring Cure Remedies, Latest News, Heal-TeluguStop.com

వారి నిద్రను పాడు చేస్తుంది.బాధ తమకు ఉండదు కాబట్టి ఎక్కువ‌ శాతం మంది గుర‌కపై పెద్దగా శ్రద్ధ పెట్టరు.

అలా చేయడం చాలా పొరపాటు.ఎదుటివారి సుఖాన్ని హరించే హక్కు మనకు ఏ మాత్రం లేదు.

అందుకే నిద్రించే సమయంలో గురక రాకుండా పలు జాగ్రత్తలు తీసుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.

సాధారణంగా కొందరు రాత్రుళ్లు ఒక పెగ్ వేయనిదే నిద్రపోరు.అయితే గుర‌క రావడానికి మద్యం ఒక కారణంగా చెప్పుకోవ‌చ్చు.కాబట్టి నిద్రించే ముందు మద్యానికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.

అలాగే జలుబు(cold) చేసినప్పుడు ముక్కు క్లోజ్ అయిపోతుంది.దీని వల్ల గురక పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

అందుకే మనం మొదట ముక్కును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.తద్వారా గురకను కంట్రోల్ అవుతుంది.

అధిక బరువు కూడా గురకకు ఒక కారణం.అందుకే శరీర బరువును(Weight loss) అదుపులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి.తద్వారా గురక స‌మ‌స్య‌ను సుల‌భంగా నివారించుకోవ‌చ్చు.రాత్రుళ్ళు నిద్రించే ముందు అర టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కు అర టేబుల్ స్పూన్ తేనె(Honey) కలిపి తీసుకోవాలి.

ఇలా చేస్తే గుర‌క రాకుండా ఉంటుంది.లేదా రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి.ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.ఇక వెల్లకిలా పడుకున్నప్పుడు గురక ఎక్కువగా వస్తుంది.

అందుకని నిద్రించే స‌మ‌యంలో పక్కకు తిరిగి పడుకోవాలి.యోగా, ప్రాణాయామం అలవాటు చేసుకోవడం వల్ల గుర‌క స‌మ‌స్య‌ను దూరం చేసుకోవ‌చ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube