సూపర్ స్టార్ రజినీకాంత్ మ్యాజికే వేరు.బ్లాక్ అండ్ వైట్ లో, సినిమా స్కోప్ లో, డిజిటల్ లో, ఆనిమేషన్ లో .
ఇలా ప్రతి ఫేజ్ లో హీరోగా చేసిన యాక్టర్ రజినీ ఒక్కడే కావడం విశేషం.గమ్మత్తు ఏమిటంటే, బాలనటుడిగా రజినితో నటించిన హృతిక్ ఇప్పుడు బాలివుడ్ అగ్రహీరోల్లో ఒకడు.
కేరీర్ మొదలుపెట్టి నాలుగు దశాబ్దాలు గడిచినా, రజినీ క్రేజ్ అణువంతా కూడా తగ్గలేదు.
ఇక విషయంలోకి వెళ్తే 1986 లో ” భగవాన్ దాదా” అనే హిందీ చిత్రంలో నటించాడు రజినీ.
ఈ చిత్రానికి హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మాత.అప్పుడు హృతిక్ చిన్నపిల్లాడు.సినిమాలో హృతిక్ తో కూడా ఓ క్యారెక్టర్ చేయించారు.
అయితే రజినితో కలిసి ఓ సన్నివేశం చేస్తున్నప్పుడు హృతిక్ బాగా తడబడ్డాడంట.
డైలాగ్ సరిగా చెప్పలేకపోయాడంట.హృతిక్ భయపడకుండా, హృతిక్ ని ఎవరు ఏమి అనకుండా, హృతిక్ తడబడినప్పుడల్లా కావాలని ఆ షాట్ ని తానే చెడగొట్టి , తనవల్లే అంతా జరిగినట్టు నమ్మిస్తూ, హృతిక్ ని ఎంకరేజ్ చేసాడంట రజిని.
ఈ జ్ఞపకాల్ని హృతిక్ స్వయంగా రజిని పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో పంచుకున్నాడు.







