కాంగ్రెస్, బీజేపీపై బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కొంతమంది డిక్లరేషన్ పేరుతో డ్రామాలు ఆడుతుండగా ఓటమి భయంతో జమిలి ఎన్నికల పేరుతో బీజేపీ కొత్త నాటకానికి తెర తీసిందని ఆరోపించారు.
జమిలి ఎన్నికలపై వేసిన కమిటీలో దక్షిణ భారత్ నుంచి ఒక్కరూ లేరని మంత్రి హరీశ్ రావు తెలిపారు.దక్షిణ భారతదేశంపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ వివక్ష చూపుతోందన్న మంత్రి హరీశ్ రావు మూడో సారి బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రజలు ఎప్పుడో డిక్లేర్ చేశారని ధీమా వ్యక్తం చేశారు.
తాము రాష్ట్రంలో అభివృద్ధి చేసే ఓట్లను అడుగుతున్నామని స్పష్టం చేశారు.