టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య( Akkineni Naga Chaitanya ) గురించి మనందరికి తెలిసిందే.నాగ చైతన్య ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు చైతన్య.అయితే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది.
చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టారు.కానీ, చైతన్య మాత్రం ఇంకా ఒకేలాంటి సినిమాలు చేస్తున్నాడు అనేది అక్కినేని ఫ్యాన్స్ మాట.
అయితే గత ఏడాది దూత సిరీస్( Dootha serirs ) తో చై కూడా పాన్ ఇండియా ఫ్యాన్స్ దృష్టిలో పడ్డాడు.అయితే సినిమాల పరంగా చై ఇంకా వెనకే ఉన్నాడని చెప్పాలి.గత కొంతకాలంగా ఈ హీరోకు అంతగా సక్సెస్ లేదనే చెప్పాలి.దీంతో ఎలాగైనా ఈసారి హిట్ కొట్టి ఇండస్ట్రీని దద్దరిల్లేలా చేయాలనీ నిర్ణయించుకున్నాడట చైతన్య.అందుకే హిట్ డైరెక్టర్, హిట్ బ్యానర్ లో సినిమాను ఓకే చెప్పాడు.అదే తండేల్( Tandel ).కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్న చందు మొండేటి( Chandu mondeti ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో చైతన్య సరసన సాయి పల్లవి ( Sai Pallavi )హీరోయిన్ గా నటిస్తోంది.లవ్ స్టోరీ తర్వాత వీరిద్దరి కాంబోలో ఇప్పటికే లవ్ స్టోరీ వచ్చిన విషయం తెల్సిందే.ఇక ఈ సినిమాలో చై.మత్స్యకారుడుగా కనిపించబోతున్నాడు.గుజరాత్ తీరంలో సముద్ర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు చందు.
ఇప్పటికే ఈ సినిమా మీద అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.ఇక చై ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు.కథ నచ్చితే తప్ప ఏ సినిమాను ఒప్పుకొని సాయి పల్లవి.ఈ సినిమాను ఒప్పుకుంది అంటే కథ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించవచ్చు.
ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ లో కొన్ని ఫోటోలను మేకర్స్ షేర్ చేశారు.అందులో సాయి పల్లవి, చై లుక్ అదిరిపోయింది.
ఇది కూడా ఒక కల్ట్ క్లాసిక్ అవుతుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.అక్కినేని వారసుడు ఈసారి కొడితే ఇండస్ట్రీ దద్దరిల్లడమే? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.మరి ఈసారైనా నాగచైతన్య పాన్ ఇండియా హీరోగా మారుతాడో లేదో చూడాలి మరి.