సాధారణంగా కొందరికి హెయిర్ రీ గ్రోత్( Hair Re Growth ) అనేది సరిగ్గా ఉండదు.దీని వల్ల జుట్టు ఊడుతుంది తప్ప.
కొత్త జుట్టు మొలవదు.ఫలితంగా రోజురోజుకు జుట్టు సన్నబడిపోతూ ఉంటుంది.
ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు ది బెస్ట్ గా వర్కోట్ అవుతుంది.ఈ రెమెడీని ఫాలో అవ్వడం ద్వారా రెండు నెలల్లో మీ జుట్టు రెండింతలు అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసి ఉడికించాలి.జెల్లీ స్ట్రక్చర్( Jelly Structure ) వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
స్ట్రైనర్ సాయంతో జెల్ ను సపరేట్ చేసుకొని చల్లార బెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు వైట్ రైస్ ను వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్( Amla Powder ) మరియు అరకప్పు అవిసె గింజల జెల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకుని మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
అవిసె గింజల జెల్, వైట్ రైస్( White Rice ), ఆమ్లా పౌడర్ మరియు బీట్ రూట్ పౌడర్ లో ఉండే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్లు మరియు ఇతర పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగ్గా మారుస్తాయి.జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.

ఈ రెమెడీని కంటిన్యూ గా ఫాలో అయితే రెండు నెలల్లోనే మీరు మంచి రిజల్ట్ గమనిస్తారు.మీ జుట్టు క్రమక్రమంగా ఒత్తుగా మారుతుంది.అలాగే ఈ రెమెడీ కురులను సిల్కీగా, షైనీ గా( Silky and Shiny Hair ) మెరిపిస్తుంది.జుట్టు రాలడాన్ని అరికడుతుంది.మరియు త్వరగా జుట్టు తెల్లబడకుండా సైతం అడ్డుకట్ట వేస్తుంది.