సోషల్ మీడియాలో థమన్ పై ఎప్పుడూ ఏదో ఒక విషయమై విమర్శలు వస్తూనే ఉంటాయి.ఆ మధ్య వరుసగా కాపీ క్యాట్ అంటూ విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే.
ఆ తర్వాత హీరోలతో పాటలు పాడించి బలవంతంగా ప్రేక్షకులపై రుద్దుతున్నాడు అంటూ విమర్శలు చేయడం జరిగింది.ఇప్పుడు ఆయన తీరును చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు.
థమన్ తాను వర్క్ చేసే ప్రతి సినిమాను కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నట్లుగానే మాట్లాడుతూ ఉన్నాడు.ఆ మధ్య బాలకృష్ణ తో అఖండ సినిమా చేసిన సమయంలో తన ఆల్ టైమ్ ఫేవరేట్ హీరో బాలకృష్ణ అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ సమయంలో అఖండ సినిమా కు ఒక అభిమానిగా మ్యూజిక్ ఇస్తాను అన్నాడు.ఆ తర్వాత బాలయ్య వీర సింహారెడ్డి సినిమా సమయంలో కూడా తెగ హడావుడి చేశాడు.
ఇక చిరంజీవి సినిమాకు సంగీతం అందించే అవకాశం వచ్చిన వెంటనే ఆకాశమే హద్దు అన్నట్లుగా.మెగా ఫ్యాన్స్ లో ఒక్కడిగా చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తాడు.

నా దేవుడు చిరంజీవి కి తగ్గట్లుగా అద్భుతమైన పాటలు ఇస్తాను అన్నట్లుగా తెగ హడావుడి చేశాడు.ఇక త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబో సినిమా ను డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నాడు.రామ్ చరణ్ మరియు శంకర్ కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించి సంగీతం ఇస్తూ కూడా ఇలాంటి ఒక సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను.నా అభిమాన నటుడు రామ్ చరణ్ మరియు అభిమాన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అవ్వడంతో ఆర్‌సీ 15 కి తన యొక్క బెస్ట్ ఇస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.