రిలీజ్‌కు ముందే అదరగొడుతున్న రికార్డులు.. హీరోలకు సోషల్ మీడియా టెస్ట్

ఒకప్పుడు సినిమా అయితే రిలీజ్ అయ్యాక ఎలా ఉంది ? ఎంత కలెక్ట్ చేసింది అన్న దానిమీదనే దృష్టి ఉండేది.రికార్డ్స్ కూడా దాని మీదనే నమోదు అయ్యేవి.

 Social Media Tests To Tollywood Heros Svp Rrr Pushpa Radhe Shyam Details, Tollyw-TeluguStop.com

కానీ నేటి సినిమాలకు చూసుకుంటే అది పూర్తిగా మారిపోయింది.రిలీజ్ కు ముందే రికార్డులు బద్దలు అవుతున్నాయి.

ఎందుకంటే సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ నుండి ట్రైలర్ వరకు అన్నీ సోషల్ మీడియాలో ఎన్ని వ్యూస్, లైక్స్ , షేర్స్ అంటూ ఫ్యాన్స్ మోతెక్కిస్తున్నారు.అయితే తాజాగా మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట నుండి విడుదలయిన ట్రైలర్ ఈ రికార్డులలో ఏ స్థాయిలో ఉందో చూద్దాం.

ముఖ్యంగా ఇతర అభిమానుల కన్నా కూడా మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా పట్ల అత్యంత ఉత్సాహాన్ని కనబరుస్తుంటారు.ఈ సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి విషయం హైలైట్ చేయడానికి ట్రై చేశారు.

ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ కూడా యు ట్యూబ్ లో ఎక్కువ మంది వీక్షించిన ట్రైలర్ గా రికార్డు సృష్టించింది.అంటే ఈ ట్రైలర్ ను విడుదలైన ఒక్క రోజులో 2 కోట్ల 67 లక్షల సార్లు చూసినట్లుగా రికార్డు అయింది.

ఇప్పటి వరకు ఇదే అత్యధికం అని తెలుస్తోంది.అలా మహేష్ బాబు సినిమా ట్రైలర్ ను సోషల్ మీడియాలో ఎక్కువ మంది చూసిన విభాగంలో మొదటి స్థానాన్ని ఇచ్చారు.

Telugu Acharya, Beast, Bheemla Nayak, Pushpa, Radhe Shyam, Heros, Tollywood, Vaa

దీనితో మహేష్ ఫ్యాన్స్ అంతా హుషారులో ఉన్నారు.ఇక ఈ సినిమా కాకుండా ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాల ట్రైలర్ వ్యూ రికార్డును చూస్తే, ప్రభాస్ రాధే శ్యామ్ 2 కోట్ల 32 లక్షల వ్యూస్ రెండవ స్థానంలో ఉంది, ఇక మూడవ స్థానంలో చిరు నటించిన ఆచార్య మూవీ ఉంది, ఆస్ తర్వాత స్థానాల్లో వరుసగా బాహుబలి 2 మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమాలు ఉన్నాయి.

ఈ ట్రైలర్ ను వీక్షించడం ఒక ఎత్తు అయితే అది నచ్చిందా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్ కదా… అందుకే ఈ ట్రైలర్ ను చూసి లైక్ చేసిన వారి నెంబర్ లో ఈ సినిమా మాత్రం రెండవ స్థానానికి పరిమితం అయింది.ఈ ట్రైలర్ ను ఒక్క రోజులో 12 లక్షల 19 వేల మంది లైక్ చేశారు.

అయితే దీని కన్నా ముందు ఆర్ ఆర్ ఆర్ మూవీ 12లక్షల 40వేల లైక్స్ తో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

Telugu Acharya, Beast, Bheemla Nayak, Pushpa, Radhe Shyam, Heros, Tollywood, Vaa

ఇక అదే విధంగా లైక్స్ పరంగా చూసుకుంటే, ఆర్ ఆర్ ఆర్ మరియు సర్కారు వారి పాట తర్వాత స్థానాల్లో భీమ్లా నాయక్, వకీల్ సాబ్, పుష్ప, ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు ఉన్నాయి.కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాలు రెండు ఉండడం వారి ఫ్యాన్స్ కు కిక్కిచ్చే విషయం అని చెప్పాలి.అయితే ఇది కేవలం టాలీవుడ్ సినిమాలలో మాత్రమే.

అయితే మొత్తం సౌత్ ఇండస్ట్రీ గురించి చూస్తే, తమిళ్ సినిమా విజయ్ బీస్ట్ అత్యధికంగా చూసిన ట్రైలర్ గా ముందు ఉంది.ఈ ట్రైలర్ ను ఒక్క రోజులో 2 కోట్ల 90 లక్షల మంది సార్లు చూడడం గమనార్హం.

ఇక లైక్స్ పరంగా సౌత్ ఇండియా లో చూసుకుంటే, ఇక్కడ కూడా విజయ్ బీస్ట్ నెంబర్ వన్ స్థానంలో ఉంది.

Telugu Acharya, Beast, Bheemla Nayak, Pushpa, Radhe Shyam, Heros, Tollywood, Vaa

ఆ తర్వాత కూడా విజయ్ నటించిన బిగిల్, అజిత్ నటించిన వాలిమై, ఆర్ ఆర్ ఆర్, సర్కారు వారి పాట, విశ్వాసం మరియు భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ లు ఉండడం విశేషం.అయితే సినిమా ఫలితం తేడా అయినప్పటికీ విజయ్ నటించిన బీస్ట్ మాత్రం అటు ట్రైలర్ వ్యూస్ మరియు లైక్స్ రికార్డ్స్ లో సౌత్ లోనే మొదట స్థానంలో ఉంది.ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా రిలీజ్ కన్నా ముందే ట్రైలర్ వ్యూస్ లో మొదటి స్థానం అలాగే లైక్స్ లో రెండవ స్థానముతో మంచి స్టార్టింగ్ ను ఇచ్చారు.

అదే విధంగా సినిమా కూడా సక్సెస్ చేస్తారా అన్నది తెలియాలంటే మే 12 వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube